త్యాగనిరతికి ప్రతీక బక్రీద్


Mon,August 12, 2019 11:17 PM

టేక్మాల్/పెద్దశంకరంపేట/పాపన్నపేట/అల్లాదుర్గం/చిన్నశంకరంపేట: బక్రీద్‌ను ఆయా మం డలాల్లో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అల్లాను స్మరిస్తూ ముస్లింలు మసీద్‌లలో ప్రార్థనలు చేసి ఈద్గా వద్దకు ర్యాలీగా వెళ్లారు. అక్క డ సామూహికంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మత పెద్దలు పండుగ ప్రాముఖ్యత ను తెలియజేశారు. హిం దూ, ముస్లింలు మతసామరస్యంతో పండుగను జరుపుకున్నారు.

రేగోడ్‌లో...
రేగోడ్: మండలంలోని ముస్లిం లు బక్రీద్ పండుగను సోమవారం జరుపుకున్నారు.గ్రామాల్లోని ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలను చేశా రు. మండల కోఆప్షన్ సభ్యుడు చోటూమియాకు మండల నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమాల్లో ఖాజీ హమీదుద్దీన్,మత పెద్ద శాదుల్, జెడ్పీటీసీ యాదగిరి, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు నాగిరెడ్డి, మాజీ అధ్యక్షుడు అనీల్‌కుమార్, మాజీ సర్పంచ్ సంగమేశ్వర్, పాల్గొన్నారు.

హవేళిఘనపూర్‌లో
హవేళిఘనపూర్: మండల కేంద్ర ంతోపాటు మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో ముస్లింలు బక్రీద్ పండుగను సోమ వారం నిర్వహించారు. ఈ సందర్భం గా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమం లో పాషా, కోఆప్షన్ సభ్యు డు ఖాలేద్‌తో పాటు ముస్లింలు పాల్గొన్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...