భూసమస్యలు పరిష్కరించాలి


Mon,August 12, 2019 11:15 PM

హత్నూర : రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలు వెంటనే పరిష్కరించాలని సంగారెడ్డి ఆర్డీవో శ్రీనివాస్ సూచించారు. సోమవారం తహసీల్దార్ కార్యాలయం లో పలు రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ మండలంలో భూవాణి కార్యక్రమంలో 1752 దరఖాస్తులు వచ్చాయని, 942 దరఖాస్తులను పరిష్కరించినట్లు తెలిపారు. 550 దరఖాస్తులకు సంబంధించిన భూ సమస్యలు పరిష్కారం కావని విచారణలో తేలినట్లు పేర్కొన్నారు. 150 దరఖాస్తులు వారం రోజుల్లో పరిష్కరించాలని స్థానిక రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అనంతరం కార్యాలయ సిబ్బంది, వీఆర్వోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో తహసీల్దార్ జయరాం, డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్‌రావు, ఆర్‌ఐ శ్రీనివాస్‌తోపాటు వీఆర్వోలు ఉన్నారు.

77
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...