వ్యవసాయంపై విద్యార్థుల సర్వే


Mon,August 12, 2019 11:15 PM

నర్సాపూర్ రూరల్: మండల పరిధిలోని గూడెంగడ్డ గ్రామంలో సోమవారం అపోలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ టెక్నాలజీ అండ్ రిసర్చ్ భువనగిరి విద్యార్థులు వ్యవసాయ పంటలపై సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని రైతులతో సమావేశం నిర్వహించి వ్యవసాయానికి సంబంధించిన అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎవరు ఏ పంటలు వేస్తున్నారు, ఎలాంటి మందులు వాడుతున్నారు. పంట పెట్టుబడి తదితర అంశాల గురించి రైతుల నుంచి సమాచారాన్ని సేకరించారు. అనంతరం పంట పొలంలో విద్యార్థులు నాటు వేశారు. ఈ కార్యక్రమంలో కో-ఆర్డినేటర్ ప్రణయ, సైంటిస్ట్ ఉదయ్‌కుమార్, విద్యార్థులు శ్రీలత, శ్రేయ, అఖిల, కస్తూరి, ప్రియాంక, రైతులు పాల్గొన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...