రాష్ట్రస్థాయి బాలికల ఫుట్‌బాల్ చాంపీయన్‌షిప్‌గా మెదక్ జిల్లా జట్టు


Mon,August 12, 2019 11:14 PM

మెదక్, నమస్తే తెలంగాణ: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో జరిగిన రాష్ట్రస్థాయి మూడో సీనియర్ బాలికల ఫుట్‌బాల్ పోటీల్లో మెదక్ జిల్లా జట్టు విజేతగా నిలిచింది. గత మూడు రోజులుగా ఫుట్‌బాల్ మ్యాచ్‌లు కొనసాగుతుండగా ఆదివారం రంగారెడ్డి జిల్లాపై జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో ప్రతిభ కనబర్చి ఫైనల్‌కు చేరుకున్న జిల్లా జట్టు సోమవారం డిపెండింగ్ చాంపీయన్ నిజామాబాద్‌తో హోరాహోరిగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో నిర్ణీత సమయంలో 1-0 గోల్‌తో విజయం సాధించి విన్నర్‌గా నిలిచి రాష్ట్రస్థాయి చాంపీయన్‌షిప్ సాధించి ట్రోఫీ కైవసం చేసుకున్నట్లు జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస్‌రెడ్డి, నాగరాజులు తెలిపారు. రాష్ట్ర ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పాల్గుణ జిల్లా జట్టుకు కప్‌ను అందజేశారు.

రాష్ట్రస్థాయికి ఇద్దరు క్రీడాకారుల ఎంపిక...
ఫైనల్ పోటీతో పాటు పలు మ్యాచ్‌ల్లో అత్యున్నత ప్రతిభ కనబర్చిన గోల్‌కీపర్ భాగ్యమ్మ, ఫార్డర్ క్రీడాకారిని నగ్మలను రాష్ట్ర ఫుట్‌బాల్ జట్టుకు ఫుట్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి పాల్గుణ ఎంపిక చేశారని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వీరిద్దరూ మెదక్ జిల్లాకు చెందిన వారే కావడం విశేషం.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...