గ్రామాలను హరితవనాలుగా తీర్చిదిద్దాలి


Sun,August 11, 2019 11:44 PM

ములుగు : లక్ష్యానికి మించి మొక్కలు నాటి గ్రామాలను హరితవనాలుగా తీర్చిదిద్దాలని టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు, మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ బట్టు అంజిరెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రం ములుగులో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు బట్టు అంజిరెడ్డి మాట్లాడుతూ... మొక్కల పెంపకం ప్రతి ఒక్కరు భాధ్యతగా భావించాలని అన్నారు. ములుగు మండలాన్ని అకుపచ్చగా తీర్చిదిద్దడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమిష్టిగా కృషి చేయలన్నారు. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు లింగ హరిబాబు, బొడ్డు ప్రవీణ్, వార్డు సభ్యులు, నాగేశ్, శ్రీరాములు, కనకయ్య నాయకులు దాస చంద్రశేఖర్, శ్రీను, కనకయ్య తదితరులు పాల్గొన్నారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...