మరుగుదొడ్లను వినియోగించుకోవాలి


Sun,August 11, 2019 11:44 PM

చిన్నశంకరంపేట: సంపూర్ణ పారిశుద్ధ్యానికి గ్రామస్తులంతా సహకరించాలని సర్పంచ్ మీనా కోరారు. ఆదివారం మండల పరిధిలోని గజగట్లపల్లిలో గడ్డి మందును పిచికారీ చేశారు. ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ నిర్మించుకున్న మరుగుదొడ్లను వినియోగించుకోవాలన్నారు. ఇంటి పరిసరాలను నీటి నిల్వ లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. నీటి నిల్వ ఉంటే దోమలు అధికమై వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకుడు అవుసుల రవీందర్, వార్డు సభ్యులు, గ్రామపంచాయతీ సిబ్బంది, తదితరులు ఉన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...