కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి


Sun,August 11, 2019 11:44 PM

పెద్దశంకరంపేట:కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని వైసీపీ విద్యార్థి విబాగం జిల్లా అధ్యక్షుడు నరేశ్ అన్నారు. ఆదివారం స్థానిక విలేకరులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కార్పొరేట్ విద్యాసంస్థలు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారన్నారు. విద్యాహక్కు చట్టాన్ని కూడా పాటించడం లేదని, విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి పేద విద్యార్థులకు 25శాతం ఉచిత విద్యను అందజేయాలన్నారు. జిల్లా అధికారులు స్పందించి అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలన్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...