నాట్లు వేసుకోవడం ఆనందంగా ఉంది


Sun,August 11, 2019 11:43 PM

పాపన్నపేట: అసైన్డ్ భూములకోసం మండలంలోని పొడ్చన్‌పల్లి గ్రామ దళిత రైతులు సాగిస్తున్న ఉద్యమం కొనసాగుతూనే ఉంది. మా భూములు మాకు కావాలంటూ 40 రోజులుగా ఎన్ని వినతిపత్రాలు ఇచ్చినా తహసీల్దార్ స్పందించక పోవడంతో దళిత రైతులు కోర్టుకు వెళ్లారు. ప్రభుత్వం ఇచ్చిన పట్టాదారు పాస్ పుస్తకాలు, రైతుబంధు స్కీంకు సంబంధించిన వివరాలు, పొడ్చన్‌పల్లి యూకోబ్యాంకు నుంచి తీసుకుంటున్న లోన్ వివరాలను కోర్టుకు ఆధారాలతో పాటు సమర్పించడంతో...కోర్టు స్టేటస్‌కో మంజూరు చేసినట్లు రైతులు వివరించారు. మీ భూముల్లో మీరు పంటల సాగుచేసుకోవచ్చు అని కోర్టు స్పష్టం చేసినట్లు వెల్లడించారు. దీంతో పొడ్చన్‌పల్లి దళితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా మూకుమ్మడిగా పొలాల్లో నాట్లు వేశారు. కోర్టు తీర్పు నేపథ్యంలో దళిత రైతులు మాట్లాడుతూ మా పంట పొలాల్లో మేము నాట్లు వేసుకోవడం ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది దళితులు పాల్గొన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...