సెప్టెంబర్ మొదటి వారంలో జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్


Sun,August 11, 2019 11:43 PM

-జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి
మెదక్, నమస్తే తెలంగాణ: జిల్లాస్థాయి జాతీయ 27వ బాలల సైన్స్ కాంగ్రెస్ సెప్టెంబర్ మొదటి వారంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ జిల్లా సమన్వయకర్త, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 10 నుంచి 17 సంవత్సరాల వయస్సు గల పాఠశాలకు వెళ్లే విద్యార్థు లు, బడి బయట పిల్లలు సైతం సైన్స్ కాంగ్రెస్‌లో పాల్గొనవచ్చన్నారు. ఒక గ్రూప్‌లో ఇద్దరు విద్యార్థులు ఉంటారని, అందులో ఒకరు గ్రూప్ లీడర్‌గా వ్యవహరిస్తారని తెలిపారు. జిల్లాలోని అన్ని పాఠశాలల సైన్స్ ఉపాధ్యాయులకు ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు రాజిరెడ్డి పేర్కొన్నారు.

ఈ సంవత్సరం పరిశుభ్రత, హరితతో ఆరోగ్యకరమైన దేశం కోసం శాస్త్ర మరియు సాంకేతిక నూతన ఆవిష్కరణలు అనే ప్రధాన అంశంతో పాటు 1. పర్యావరణ వ్యవస్థ, సబంధిత సేవలు 2.ఆరోగ్యం, పారిశుధ్యం, స్వచ్ఛత 3.వ్యర్థ పదార్థాల నుంచి సంపద సృష్టి 4.సమాజం, సంస్కృతి, జీవన పాదులు 5.సాంప్రదాయక విజ్ఞాన వ్యవస్థలు అనే ఐదు ఉప అంశాలాల్లో ఏదైన ఒక దానికి అనుగుణంగా స్థానిక సమస్యను ఎన్నుకుని ప్రాజెక్టును తయారు చేసి ప్రాజెక్టు రిపోర్టును మాత్రమే ప్రదర్శించాలన్నారు. ఎగ్జిబిట్ అవసరం లేదన్నారు. జిల్లాస్థాయిలో గ్రూప్ లీడర్, గైడ్ టీచర్లు మాత్రమే పాల్గొన్నాలని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులను గుర్తించి వారిని ప్రోత్సహించాలని ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు సూచించారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...