జోరుగా హరితహారం


Sat,August 10, 2019 11:36 PM

రామాయంపేట: మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ అని రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్, రామాయంపేట లయన్స్‌క్లబ్ చైర్మన్ ఏలేటి రాజశేఖర్‌రెడ్డి, రామాయంపేట కార్యదర్శి లక్ష్మణ్‌యాదవ్, జిల్లా చైర్మన్ దేమె యాదగిరిలు అన్నారు. శనివారం రామాయంపేట జాతీయ రహదారిపై మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. మానవాళి మనుగడకు చెట్లు ఎంతో దోహద పడుతాయని అన్నారు. నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలో సర్పంచ్ చప్పెట నర్సింహారెడ్డి, ఉపసర్పంచ్ స్వామిలు మొక్కలు నాటారు. నందిగామ సర్పంచ్ లద్ద ప్రీతి, ఎంపీటీసీ సురేశ్, ఉపసర్పంచులు మొక్కలు నాటి గ్రామస్తులకు మొక్కలను అందజేశారు.

మొక్కలే మానవ మనుగడకు జీవనాధారం
రామాయంపేట రూరల్: మానవ మనుగడకు మొక్కలే జీవనాధారం అని స్నేహబంధు ఆఫ్ రామాయంపేట అయన్స్‌క్లబ్ ప్రతినిధులు పేర్కొన్నారు. శనివారం రామాయంపేట మం డలం కాట్రియాల గ్రామంలో మెడిసిటి దవాఖాన ఉచిత హెల్త్ క్యాంప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామస్తుల్లో అవసరమైన వారికి ఉచితంగా మందు లు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సర్పంచ్ మైలారం శ్యాములు మాట్లాడుతూ మారుతున్న వాతావరణ పరిస్థితులకు చెట్లు లేకపోవడమే కారణమన్నారు. అనంతరం లయన్స్ క్లబ్ సభ్యులు గ్రామంలో మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కొత్త స్రవంతి రాజేందర్ లయన్స్‌క్లబ్ స్నేహబంధు అధ్యక్షుడు దామోదర్‌రావు కార్యదర్శి రవీందర్ పీఆర్‌వో బాలరాజు డైరెక్టర్ చంద్రం గురువయ్య దవాఖాన డాక్టర్లు పాల్గొన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...