విద్యార్థికి అభినందనలు


Sat,August 10, 2019 11:35 PM

రామాయంపేట: 2019లో అత్యధిక మార్కులను సాధించిన స్నేహ కళాశాల విద్యార్థిని ఎన్ పూజితకు కేంద్ర ప్రభుత్వం ఇన్స్‌ఫైర్ అవార్డుకు ఎంపిక చేసిందని రామాయంపేట స్నేహకళాశాలల వ్వస్థాపకుడు, చైర్మన్ వలిశెట్టి సత్యనారాయణ అన్నారు. శనివారం రామాయంపేట పట్టణంలోని కళాశాలలో బాలిక పూజితకు అవార్డు పత్రాన్ని అందజేశారు. స్నేహ కళాశాలలో 2019 సంవత్సరంలో వెయ్యి మార్కులకు గానూ పూజిత 980 మార్కులను సాధించిందన్నారు. విద్యార్థిని పూజితకు ప్రతి విద్యా సంవత్సరం రూ.80వేల స్కాలర్‌షిప్‌ను అందజేయనున్నట్లు తెలిపారు. ఐదు సంవత్సరాల పాటు మొత్తం రూపాయలు నాలుగు లక్షలను బ్యాంకు ద్వారా విద్యార్థికి చెందనున్నట్లు తెలిపారు. పూజిత అవార్డుకు ఎంపిక కావడంతో చైర్మన్ వలిశెట్టి సత్యనారాయణ, కళాశాల ప్రిన్సిపాల్ సంతోష్ కుమార్‌లు అభినందించారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...