రాష్ట్ర గౌడ సంఘం నాయకులకు ఘన సన్మానం


Sat,August 10, 2019 11:35 PM

తూప్రాన్, నమస్తే తెలంగాణ : రాష్ట్ర గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా తూప్రాన్‌కు చెంన జానకీరామ్ గౌడ్, రాష్ట్ర కమిటీ కార్యదర్విగా తూప్రాన్‌కు చెందిన ఏఎంసీ వైస్ చైర్మన్ శ్రీశైలం గౌడ్‌లను శనివారం జెడ్పీ చైర్ పర్సన్ హేమలతా శేఖర్‌గౌడ్ సన్మానించారు. ఈ సందర్భంగా శనివారం తూప్రాన్‌లోని వారి నివాసంలో వారిని ఘనంగా సత్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గౌడ కులస్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వారికి సూచించారు. కార్యక్రమంలో నాయకులు మాజీ ఎంపీపీ గుమ్మడి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ కమ్మరి సత్యనారాయణ, మునావర్, వెంకటేశ్ గుప్తా, లక్ష్మణ్, అనీల్ తదితరులు పాల్గొన్నారు.

75
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...