గురుపాదగుట్ట శివాలయంలో 12నుంచి శ్రావణమాస ఉత్సవాలు


Sat,August 10, 2019 11:35 PM

పెద్దశంకరంపేట: పెద్దశంకరంపేట శివారులోని గురుపాదగుట్ట శివాలయంలో ఈనెల 12 నుంచి శ్రావణమాస ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యుడు బల్‌రాం సంగమేశ్వర్ శనివారం తెలిపారు. ఈనెల12న భ్రమరాంభ సమేత మల్లికార్జున స్వామికి అష్టోత్తర శతాబిషేకం, లక్ష బిల్వార్చన, 16న కట్టమైసమ్మ తల్లికి అబిషేకం, కుంకుమార్చన, ఒడిబియ్యం, 19న గురుపాదగుట్టలో 51 వరద శంకర వ్రతాలు చేయబడునన్నారు శ్రావణ మాసంలో ప్రతి శనివారం ఉదయం ప్రసన్న వీరాంజనేయస్వామికి 21 కలశాలతో అభిషేకం, చందన అలంకరణ పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. శ్రావణ మాసంలో ప్రతి సోమవారం అన్నదానం భజన కార్యక్రమాలు చేపట్టనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ కమిటీ సభ్యుడు తెలిపారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...