సర్కారు దవాఖానలో మెరుగైన వైద్యం అందించాలి


Fri,August 9, 2019 11:35 PM

మెదక్ మున్సిపాలిటీ : సర్కారు దవాఖానలో ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు, దవాఖానలో డాక్టర్ల కొరత, సిబ్బంది కొరత తదితర అంశాలపై వైద్య అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ దవాఖానలో తాగునీటి కొరత లేకుండా చూడాలని వైద్యులకు సూచించారు. అలాగే ప్రభుత్వం అందిస్తున్న దివ్యాంగుల పింఛన్ల కోసం జిల్లాలో అర్హులైన వారిని గుర్తించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ ఇచ్చే సదరం సర్టిఫికెట్ల కోసం జనం విపరీతంగా తరలివస్తున్నారని అన్నారు. కానీ ప్రభుత్వ నియమనిబంధనల మేరకే సర్టిఫికెట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ విషయంలో గ్రామ సర్పంచులకు అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటేశ్వర్‌రావు, డీఆర్‌డీఏ పీడీ సీతారామారావు, జిల్లా కేంద్ర దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ పి.చంద్రశేఖర్, వైద్యులు పాల్గొన్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...