నిధులు ఖర్చు చేస్తాం


Fri,August 9, 2019 11:34 PM

నర్సాపూర్, నమస్తే తెలంగాణ: నర్సాపూర్ మున్సిపాలిటీకి నిధులు మంజూరు కావడం సంతోషకరమని, అందరి అభిప్రాయం మేరకు మంజూరైన నిధులను పట్టణంలో ఖర్చుపెట్టి అభివృద్ధి పనులు చేపడుతామని ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నర్సాపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక విలేకరులతో మాట్లాడుతూ నర్సాపూర్ మున్సిపల్ ఏర్పాటైన తర్వాత టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి నర్సాపూర్ పట్టణంలో వివిధ అభివృద్ధి పనుల కోసం రూ.30 కోట్లు మంజూరు చేయాలని విన్నవించడంతో స్పందించిన కేటీఆర్ మొదటి విడుతలో రూ.15 కోట్లు మంజూరు చేసి విడుదల చేసినట్లు చెప్పారు. నిధులు మంజూరు చేయడం సంతోషకరమని అన్నారు. అందరి అభిప్రాయం మేరకే వచ్చిన నిధులను పైసా కూడా వృథా చేయకుండా ఖర్చు చేస్తామని అన్నారు. ఈ నిధులతో పట్టణంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీతో పాటు హరితరెస్టారెంట్, ఎస్సీ, ఎస్టీ భవనాలు, ఇతర అభివృద్ధి పనుల కోసం ఖర్చుచేయనున్నట్లు తెలిపారు.

నర్సాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం టీఆర్‌ఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్ మాట్లాడుతూ నర్సాపూర్ అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్నదని నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే మదన్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. డివిజన్ కేంద్రం ఏర్పాటుతో పాటు మున్సిపాలిటీ ఏర్పాటైందని అన్నారు. అనంతరం టీఆర్‌ఎస్ నాయకులు అశోక్‌గౌడ్‌తో పాటు భిక్షపతి, నగేశ్‌లు ఎమ్మెల్యే మదన్‌రెడ్డిని పూలమాల, శాలువాతో ఘనంగా సత్కరించారు. క్యాంపు కార్యాలయం ఎదుట పటాకులు కాల్చారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి దేవేందర్‌రెడ్డి, జెడ్పీటీసీలు బాబ్యానాయక్, శేషసాయిరెడ్డి, ఆంజనేయులు, మాజీ సర్పంచ్ వెంకటరమణారావు, టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు అశోక్‌గౌడ్, వాల్దాస్ మల్లేశ్‌గౌడ్, చౌటి జగదీశ్, మల్లేశ్‌యాదవ్, హబీబ్‌ఖాన్, పార్టీ మండల అధ్యక్షుడు శేఖర్, పట్టణ అధ్యక్షుడు భిక్షపతి, నాయకులు సత్యంగౌడ్, నగేశ్ పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...