పురిటి గడ్డకు సీఎం కేసీఆర్


Sun,July 21, 2019 11:45 PM

-ముస్తాబైన చింతమడక
-ఇంటింటికీ మామిడి తోరణాలు
-ఘన స్వాగతం పలకడానికి సిద్ధమైన గ్రామస్తులు
-ఉదయం 10.30 గంటలకు సీఎం కేసీఆర్ రాక
-రోజంతా గ్రామస్తులతోనే గడపనున్న సీఎం
-ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే హరీశ్‌రావు, కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి
సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : పురిటిగడ్డకు సీఎం కేసీఆర్ రానుండడంతో.. చింతమడక ముస్తాబైంది. ప్రతి ఇంట్లో మామిడి తోరణాలు... బంతిపూల దండలు.. వెల్‌కమ్ టు సీఎం కేసీఆర్... అంటూ ముగ్గులు వేసి ఘన స్వాగ తం పలికేందుకు పురిటిగడ్డ సిద్ధమైంది. సొంతూరు గ్రామస్తులతో మమేకమయ్యే సీఎం కేసీఆర్ పర్యటనకు విస్తృత ఏర్పాట్లు చేశారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు చింతమడకకు చేరుకొని సాయంత్రం 4 గంటల వరకు గ్రామంలోనే రోజంతా సీఎం కేసీఆర్ గడపనున్నారు. ఇందుకోసం నాలుగైదు రోజుల నుంచి జిల్లా అధికార యం త్రాంగం దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేశారు. ఎప్పటికప్పుడు మాజీమంత్రి, సిద్దిపేట శాసన సభ్యుడు తన్నీరు హరీశ్‌రావు, కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి, పోలీసు కమిషనర్ జోయల్‌డెవిస్‌లు గ్రామంలో పర్యటిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేశారు. వర్షాకాలం కావడంతో పూర్తిగా రెయిన్‌ప్రూప్ టెంట్లను ఏర్పా టు చేశారు. వాతావరణం అనుకూలిస్తే హెలిక్యాప్టర్ ద్వారా వాతావరణం అనుకూలంగా లేకపోతే రోడ్డు మార్గాన సీఎం కేసీఆర్ స్వగ్రామానికి రానున్నారు. అలాగే, హెలిప్యాడ్ సైతం సిద్ధం చేశారు. గ్రామస్తులందరికీ గులాబీరంగు ఐడీకార్డులను తయారు చేసి ఇంటింటికీ వెళ్లి అధికారులు అందజేశారు. ప్రతి 30 కుటుంబాలకు ఒక ఎంపీడీవో స్థాయి అధికారి ఇన్‌చార్జిగా ఉండి.. వారిని సమావేశానికి తీసుకెళ్లడం.. సమావేశం అనంతరం భోజనాలు చేయించడం.. అధికారి బాధ్య త. పాసులున్నవారికి మాత్రమే సమావేశానికి ఆహ్వానిస్తున్నారు. కేవలం చింతమడక గ్రామస్తులతోనే సీఎం కేసీఆర్ పర్యటన ఉండడంతో అందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు. అధికారులు, మీడియా, పారిశుద్ధ్య కార్మికులకు ప్రత్యేక పాసులుఅందజేశారు. సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే హరీశ్‌రావు, కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్ రోజాశర్మ, స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీలు స్వాగతం పలకనున్నారు.

ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాం గం పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసింది. 3200 మంది కూ ర్చుండేలా రేయిన్‌ప్రూఫ్ టెంట్లు వేసి గ్రీన్‌మ్యాట్ వేసి కుర్చీ లు వేశారు. మహిళలు, పురుషులు వేర్వేరుగా కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. 60 మంది కూర్చునేలా వేదికను సిద్ధం చేశారు. వేదిక పక్కనే గ్రీన్‌హౌస్ ఏర్పాటు చేశారు. ప్రతి 30 కుటుంబాలకు ఒక ప్రత్యేకాధికారిని నియమించారు. 200 మంది అధికారులకు వైట్ కలర్ గుర్తింపు కార్డులు, 200 మంది మీడియా ప్రతినిధులకు గ్రీన్ కలర్ గుర్తింపు కార్డులు అందజేశారు. మొత్తంగా 6 వేల మందికి భోజనాలను ఏర్పా టు చేస్తున్నారు. ఐకేపీ గోదాం వద్ద రేయిన్‌ప్రూఫ్ టెంట్‌ను ఏర్పాటు చేశారు. మహిళలకు, పురుషులకు వేర్వేరుగా గ్యాలరీలను ఏర్పాటు చేశారు. అధికారులు, మీడియాకు ప్రత్యేకం గా గ్యాలరీ, వేదిక 60 మంది కూర్చునేలా ఏర్పాటైంది. వేదికకు కుడి వైపున గ్రీన్‌హౌస్‌ను ఏర్పాటు చేశారు. సమావేశం అనంతరం భోజనాలు చేయడానికి మహిళలు, పురుషులకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. సీఎం కేసీఆర్ ఆత్మీయులతో కలిసి భోజనం చేయడానికి పెద్దమ్మగుడి పక్కనే రేయిన్‌ప్రూఫ్ టెంట్ వేశారు. పెద్దమ్మ గుడి ముందు చింతచెట్టు వద్ద గద్దెను కూడా నిర్మించారు. సీఎం కేసీఆర్.. పర్యటన సందర్భంగా చింతమడకలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.
బీసీ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి భూమిపూజ, డబుల్ బెడ్‌రూం ఇండ్లను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. గ్రామంలో హరితహారం కింద మొక్కలు నాటారు.

పటిష్ట బందోబస్తు
సీఎం కేసీఆర్ చింతమడక పర్యటన నేపథ్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. బందోబస్తును 15 సెక్టార్లుగా విభజించారు. ముగ్గురు అడిషనల్ ఎస్‌పీలు, ముగ్గురు ఏసీపీలు, 8 మంది డీఎస్పీలు, 32 మంది సీఐలు, 74 మంది ఎస్‌ఐలు, 64 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 635మంది కానిస్టేబుళ్లు, హోంగార్డులు, 75 మంది మహిళా కానిస్టేబుళ్లు, మహిళా హోంగార్డులు, స్పెషల్ పార్టీ, రోప్ పార్టీస్, డాగ్ స్కాడ్స్, సెక్యూరిటీ వింగ్, మఫ్టీ పార్టీ మొత్తం 1050 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

107
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...