హజ్‌యాత్ర ఎంతో పవిత్రమైంది


Sun,July 21, 2019 11:42 PM

మెదక్, నమస్తే తెలంగాణ: హజ్‌యాత్ర ఎంతో పవిత్రమైనదని.. జీవితంలో ఒకసారైన హజ్ యాత్రకు వెళ్లాలని ప్రతి ముస్లిం కోరుకుంటారని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. పవిత్ర హజ్‌యాత్రకు వెళ్లే యాత్రికులకు జిల్లా కేంద్రంలోని న్యూ భారత్ ఫంక్షన్‌హాల్‌లో అవగాహన, వ్యాక్సిన్ శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఇస్లాం ఐదు ధర్మాల్లో హజ్‌యాత్ర ఒకటన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హజ్‌యాత్ర వెళ్లే వారి కోసం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. అనంతరం హజ్ సొసైటీ సభ్యులు యాత్రలో తీసుకోవాల్సిన జాగ్రతలను వివరించారు. ఈ సందర్భంగా హజ్‌యాత్రకు వెళ్తున్న 32 మందికి పద్మాదేవేందర్‌రెడ్డి ప్రత్యేక వ్యాక్సిన్ వేశారు. కార్యక్రమంలో జిల్లా హజ్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఖాజామొయినుద్దీన్, ప్రధాన కార్యదర్శి సర్దార్‌ఖాన్, కోశాధికారి నయిమొద్దీన్, ఈద్గా కమిటీ సభ్యులు ఖాజామొయిజొద్దీన్, సబేర్, రహమత్, ఎక్బాల్, టీఆర్‌ఎస్ పట్టణ అద్యక్షుడు గంగాధర్, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు చింతల నర్సింహులు, మైనార్టీ నాయకులు గౌష్‌ఖురేషి. అజ్గర్‌అలీ, ముజీబ్, ఉమర్‌లతో ప్రభుత్వ దవాఖానకు చెందిన వైద్యులు పాల్గొన్నారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...