అరవై ఏండ్లు అరిగోస పెట్టిండ్రు


Sat,July 20, 2019 11:28 PM

రామాయంపేట : సమైక్యవాద ప్రభుత్వాల మూలంగా 60 ఏండ్లు అరిగోస పడ్డాం... మననీళ్లు మన వనరులు ఎత్తుకుపోయిండ్రు... తెలంగాణ ప్రజలను హింసలకు గురిచేసిండ్రు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే ప్రజలకు పూర్తి న్యాయం జరుగుతుంది అని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. శనివారం రామాయంపేటలోని బాలాజీ ఫంక్షన్ హాల్‌లో, నిజాంపేట మండల కేంద్రంలోని సబ్‌మార్కెట్ యార్డులో అర్హులైన లబ్ధిదారులకు పెరిగిన పింఛన్ పత్రాలను అందజేశారు. నిజాంపేట మండల కేంద్రంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభాషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆడబిడ్డల కోసం మేన మామలా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకంతో రూ. లక్ష అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. బీడీ కార్మికులకు కట్ ఆఫ్ డేట్ లేదని, ఎప్పుడు పీఎఫ్ వస్తే అప్పటి నుంచే పింఛన్ వస్తుందన్నారు. నిజాంపేట, రామాయంపేట మండలాల వ్యాప్తంగా నీళ్ల కోసం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, త్వరలోనే కాళేశ్వరంతో సమస్య పరిష్కారం అవుతుందన్నారు. బీడీ కార్మికులు తొందర పడవద్దని, సమస్యలను పరిష్కరించేందుకే ఇక్కడకు వచ్చానన్నారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట, నిజాంపేట ఎంపీడీవోలు యాదగిరిరెడ్డి, వెంకటలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ రమేశ్, మేనేజర్ శ్రీహరిరాజు, రామాయంపేట ఎంపీపీ నార్సింపేట భిక్షపతి, మాజీ ఎంపీపీ పుట్టి విజయలక్ష్మి, వైస్ ఎంపీపీ ముస్కుల స్రవంతి, జెడ్పీటీసీ జేరిపోతుల సంధ్య, మాజీ వైస్ ఎంపీపీ, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పల్లె జితెందర్‌రెడ్డి, పుట్టి యాదగిరి, సరాఫ్ యాదగిరి, ముస్కుల సిద్ధ్దిరాంరెడ్డి, రత్నం, దేమె యాదగిరి, జిల్లా డైరెక్టర్లు బాదె చెంద్రం, భాస్కర్‌రావు, శ్రీలత, భాగ్యలక్ష్మి, లక్ష్మణ్‌యాదవ్, నిజాంపేట ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు, వైస్ ఎంపీపీ అందె ఇందిర, ఏఎంసీ వైస్ చైర్మన్ అందె కొండల్ రెడ్డి, జెడ్పీటీసీ పంజ విజయ్‌కుమార్, సర్పంచ్, ఎంపీటీసీలు గెరుగంటి అనూష, పాతూరి ప్రభావతి, గోపరి నర్సింహులు, అమరసేనారెడ్డి, మాజీ ఎంపీపీ బిజ్జ సంపత్, సంగు స్వామి, లక్ష్మణ్‌గౌడ్, అంజాగౌడ్, కో ఆప్షన్ సభ్యుడు ఎండి.గౌస్, దుబ్బ రాజగౌడ్, అబ్దుల్ అజీజ్, కిష్టారెడ్డి, కర్రయ్య, లద్ద ప్రీతి, సురేశ్, సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

75
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...