ఉద్యమంలా సభ్యత్వ నమోదు


Sat,July 20, 2019 11:28 PM

నర్సాపూర్, నమస్తే తెలంగాణ: టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు టార్గెట్‌ను సకాలంలో పూర్తి చేస్తామని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు రుసుమును టీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు అశోక్‌గౌడ్ రూ.50వేలను ఎమ్మెలే మదన్‌రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని నర్సాపూర్, కౌడిపల్లి, శివ్వంపేట, కొల్చారం, చిలిపిచెడ్, వెల్దుర్తి మండలాల నుంచి సుమారు 60వేలకుపైగా సభ్యత్వాన్ని పూర్తి చేశామని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, జెట్పీటీసీ శేషసాయిరెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు, వెంకటరమణారావు, అశోక్‌గౌడ్, వాల్దాస్ మల్లేశ్‌గౌడ్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు శేఖర్, పిట్ల సత్యనారాయణ, శివాంజనేయులు, శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు సూరారం నర్సింహులు, సత్యంగౌడ్, భిక్షపతి, నగేశ్, కృపాచారి పాల్గొన్నారు.

సభ్యత్వ బుక్కులు ఎమ్మెల్యేకు అప్పగింత
కొల్చారం: మండల పరిధిలోని పలు గ్రామాల్లో టీఆర్‌ఎస్ సభ్యత్వ కార్యక్రమం ముమ్మరంగా సాగింది. ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ఆదేశాలతో మండలంలోని పలు గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు సభ్యత్వ కార్యక్రమాన్ని పోటీపడి చేయించారు. అప్పాజిపల్లిలో మాజీ సర్పంచ్ వెంకట్‌గౌడ్ ఆధ్వర్యంలో సభ్యత్వ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి శనివారం ఎమ్మెల్యే మదన్‌రెడ్డికి సభ్యత్వ బుక్కులతో పాటు డబ్బులను అప్పగించారు. కార్యక్రమంలో పోతంశెట్‌పల్లి మాజీ సర్పంచ్ కొమ్ముల యాదాగౌడ్ పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్ సభ్యత్వానికి అపూర్వ స్పందన
చిలిపిచెడ్ : టీఆర్‌ఎస్ సభ్యత్వానికి అపూర్వ స్పందన లభిస్తుందని చిట్కుల్, గౌతాపూర్, అజ్జమర్రి సర్పంచ్ పరశురాంరెడ్డి, నాయకులు రామచంద్రారెడ్డి, మాణిక్యరెడ్డి అన్నారు. శనివారం నర్సాపూర్‌లో పార్టీ ఇన్‌చార్జి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, ఎమ్మెల్యే మదన్‌రెడ్డిలకు గ్రామాల పార్టీ సభ్యత్వానికి సంబంధించిన రసీదులు, డబ్బులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం అములు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి సభ్యత్వం తీసుకోవడానికి ముందకు వస్తున్నారన్నారు.

సభ్యత్వాన్ని ఉద్యమంలా నిర్వహించాలి
కౌడిపల్లి: టీఆర్‌ఎస్ సభ్యత్వాన్ని ఉద్యమంలా నిర్వహించాలని ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం కౌడిపల్లి మండల టీఆర్‌ఎస్ నాయకులు ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డికి సభ్యత్వాలకు చెందిన రూ.2లక్షల 30వేలను నగదును అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, జడ్పీటీసీ కవితాఅమర్‌సింగ్‌రాథోడ్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కాలేరు శివాంజనేయులు, ఉమ్మడి కౌడిపల్లి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు చిలుముల వెంకటేశ్వరరెడ్డి, నాయకులు మన్సూర్, సర్దార్, ప్రవీన్‌కుమార్ పాల్గొన్నారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...