పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి


Sat,July 20, 2019 11:28 PM

తూప్రాన్, నమస్తేతెలంగాణ: తూప్రాన్ పట్టణంలో జెడ్పీ చైర్‌పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్‌గౌడ్ పర్యటించారు. పట్టణంలోని సాయినగర్‌లోని ఎక్కడి చెత్త అక్కడే పడి ఉండడంతో పాటు వెదజల్లుతున్న దుర్వాసనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుధ్యం పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని... ఇదేమి పరిస్థితి అని తూప్రాన్ మున్సిపల్ కమిషనర్ ఖాజ మోయిజొద్దీన్‌ను ప్రశ్నించారు. పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. రెండు రోజుల్లో చెత్త లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మార్పు లేకపోతే తానే స్వయంగా స్వచ్ఛభారత్ నిర్వహించి పట్టణంలో చెత్త లేకుండా శుద్ధి చేస్తామని వెల్లడించారు. కాలనీల్లో చెత్తాచెదారం పేరుపోతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. చెత్త బండ్లు సరిపోను లేవని, పారిశుధ్య కార్మికులు తక్కువ సంఖ్య ఉండడంతో చెత్త సేకరణ ఇబ్బందిగా మారిందని కమిషనర్ సమాధానం ఇవ్వడంతో వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైతే నిధులు మంజూరయ్యేలా కృషి చేస్తానని చెప్పారు. అవసరమైనంత సిబ్బంది, చెత్త సేకరణ వాహనాలు ఏర్పాటు చేయాలన్నారు. తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించాలన్నారు. కార్యక్రమంలో మనోహరాబాద్ ఎంపీపీ పురం నవనీతారవి ముదిరాజ్, మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు శేఖర్‌గౌడ్, నాయకులు సత్యనారాయణగౌడ్, పేయింటర్ శ్రీనివాస్, అబోతు వెంకటేశ్, మెన్నె శ్రీను, యాసిన్ పాల్గొన్నారు.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...