దేశమంతా తెలంగాణ వైపు చూస్తున్నది


Sat,July 20, 2019 11:27 PM

నర్సాపూర్, నమస్తే తెలంగాణ : సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న ప్రభుత్వ పథకాలతో దేశమంతా తెలంగాణ వైపు చూస్తున్నదని ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి అన్నారు. శనివారం నర్సాపూర్ పట్టణంలోని మణికొండ కల్యాణ మండపంలో కలెక్టర్ ధర్మారెడ్డితో కలిసి పెరిగిన పింఛన్ల ప్రొసీడింగ్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా పింఛన్లను పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంతం సస్యశ్యామలమవుతుందని, ముఖ్యమంత్రితో నాకున్న సన్నిహిత్యం వల్ల నియోజకవర్గానికి అత్యధికంగా నీళ్లు తెస్తానని చెప్పారు. రెండు సంవత్సరాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు వస్తే చెరువులను, కుంటలను నింపుకుంటామని అన్నారు. మంజీరా, హల్దీవాగులపై చెక్‌డ్యాంల పనులు సాగుతున్నాయని, అలాగే రూ.456 కోట్లతో జాతీయ రహదారి పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. నర్సాపూర్ అటవీ ప్రాంతంలో అర్బన్‌పార్క్ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికలను రూపొందిస్తున్నారన్నారు. సర్పంచులకు, జెడ్పీటీసీలకు, మున్సిపల్‌లకు పూర్తి అధికారాలు ఇవ్వబోతున్నారని, నిధులకు సైతం కొరత ఉండదన్నారు. ప్రభుత్వం ప్రజాప్రతినిధులకు పూర్తిస్థాయిలో అధికారం ఇవ్వబోతున్నట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్ ధర్మారెడ్డి మాట్లాడుతూ పింఛన్ల ప్రొసీడింగ్స్ రానివారు ఆందోళన చెందవద్దని, జూన్ నుంచి పెరిగిన పింఛన్లను మీ బ్యాంకు ఖాతాల్లో వేస్తామని తెలిపారు. నర్సాపూర్ నియోజకవర్గంలో 35,799 మందికి పింఛన్లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారమే లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేస్తారని చెప్పారు. చెట్లను నరకడం వల్ల అవి అంతరించి పోతున్నాయని, ప్రతి ఒక్కరూ రెండు మొక్కలను నాటాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్, గ్రంధాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, ఎంపీడీవో వామనరావు, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్, జెడ్పీటీసీలు బాబ్యానాయక్, శేషసాయిరెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్ శివకుమార్, ఎంపీపీ జ్యోతి, వైస్ ఎంపీపీ నర్సింగరావు, టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు అశోక్‌గౌడ్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు శేఖర్‌తో పాటు నియోజకవర్గంలోని ఎంపీటీసీలు, సర్పంచులు, టీఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...