పాఠశాలలో సమస్యలను పరిష్కరిస్తా


Sat,July 20, 2019 02:58 AM

తూప్రాన్, నమస్తేతెలంగాణ/ తూప్రాన్‌రూరల్ : తూప్రాన్ మండలం దాతర్‌పల్లిలోని సాంఘిక సంక్షేమశాఖ గురుకుల బాలికల పాఠాశాలలో నెలకొన్న తాగునీటి సమస్యను వారం రోజుల్లోగా పరిష్కరిస్తానని జెడ్పీ చైర్‌పర్సన్ హేమలతాశేఖర్‌గౌడ్ అన్నారు. దాతర్‌పల్లి గురుకుల పాఠశాలలో గురువారం రాత్రి బస చేసిన ఆమె శుక్రవారం ఉదయమే పాఠశాల ఆవరణలో కలియదిరిగారు. విద్యార్థుల కోసం తెప్పించిన సరుకులను స్టోర్ రూంలో పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. పాఠశాలలో పిచ్చిమొక్కలు, గడ్డిని తొలిగింప చేశారు. పాఠశాల ప్రహరీ చుట్టూ ముళ్ల పొదలు, చెట్లను తొలిగించాలని, అవసరమైతే సంబంధిత రైతులతో మాట్లాడాల్సిందిగా గ్రామ సర్పంచ్ నర్సమ్మకు సూచించారు. పాఠశాలలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వస్తుందని చెప్పడంతో విద్యుత్ సిబ్బందిని పిలిపించి మరమ్మతులు చేయించారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన కంప్యూటర్, డిజిటల్ తరగతులు స్థానిక తహసీల్దార్ శ్రీదేవి, జెడ్పీటీసీ రాణి సత్యనారాయణగౌడ్‌తో కలిసి ఆమె ప్రారంభించారు. అయితే తమకు తాగునీటి కొరత సమస్య ఉందని జెడ్పీ చైర్‌పర్సన్ హేమలతాశేఖర్‌గౌడ్ దృష్టికి తీసుకెళ్లగా వారంలోగా సమస్యను పరిష్కరిస్తానన్నారు. మిషన్ భగీరథ పథకంలో పాఠశాలకు ప్రత్యేక నల్లాలను బిగిస్తామన్నారు. పాఠశాలకు పర్మినెంట్ స్థలాన్ని కేటాయించాలని ప్రిన్సిపల్ లక్ష్మి కోరగా, అందుబాటులో ఉన్న 10 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని, ఇందుకోసం చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ శ్రీదేవిని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యాభివృద్ధి కోసం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. పాఠశాలలో విద్యార్థులకు మౌలిక సదుపాయాలను కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. దాతర్‌పల్లి గురుకుల బాలికల విద్యాలయానికి అవసరమైన 2 సీలింగ్ ఫ్యాన్‌లను బహూకరిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. దీంతో పాటే పాఠశాల గేట్‌కు మరమ్మతులు చేయిస్తానని ఆమె హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీదేవి, జెడ్పీటీసీ రాణిసత్యనారాయణ, దాతర్‌పల్లి సర్పంచ్ నర్సమ్మ, ఇస్లాంపూర్ సర్పంచ్ జంగం సుకన్యరమేశ్, కార్యదర్శి సంఘమేశ్వర్, వీఆర్వోలు వెంకటేశ్, హరీశ్, టీఆర్‌ఎస్ నాయకులు అశోక్, జయరాములుతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం..
పాఠశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్‌ను జడ్పీ అధ్యక్షురాలు ర్యాకల హేమలతా శేఖర్‌గౌడ్ శుక్రవారం ప్రారంభించారు.

ఇస్లాంపూర్‌లో మొక్కలు నాటిన జెడ్పీ చైర్ పర్సన్ హేమలతాశేఖర్‌గౌడ్
తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ పాఠశాలలో హరితహారం మొక్కలు జెడ్పీ చైర్‌పర్సన్ హేమలతాశేఖర్‌గౌడ్ శుక్రవారం నాటారు. పాఠశాల ఆవరణలో తహసీల్దార్ శ్రీదేవి, జెడ్పీటీసీ రాణిసత్యనారాయణ, సర్పంచ్ జంగం సుకన్యరమేశ్, హెచ్‌ఎం మాధవితో కలిసి ఆమె మొక్కలు నాటారు. అనంతరం పాఠశాల భోజన వంట గదిని ఆమె పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న బోధన తరగతులపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలకు హాజరవుతున్న విద్యార్థుల హాజరు పట్టికను పరిశీలించారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి తూప్రాన్ మండల కన్వీనర్ సురేందర్‌రెడ్డి, ఉప సర్పంచ్ లక్ష్మణ్‌తో పాటు టీఆర్‌ఎస్ నాయకులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

75
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...