బాలల రక్షణకు కృషి చేయాలి


Sat,July 20, 2019 02:57 AM

సంగారెడ్డి టౌన్ : బాలల రక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, జడ్జి భవానీ అన్నారు. శుక్రవారం సంగారెడ్డిలోని మహిళా ప్రాంగణంలో మహిత, ప్లాన్ ఇండియా గల్స్ అడ్వకసీ అలయన్స్‌లో భాగంగా మెడ్వాన్ సహకారంతో గ్రామస్థాయి చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలు వారి బాధ్యతలపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జడ్జి భవానీ మాట్లాడుతూ గ్రామ స్థాయి చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలు పిల్లల సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కారం చేసేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. గ్రామాలలో ప్రతి ఒక్కరికీ బాలల రక్షణపై దృష్టి పెట్టేలా అవగాహన కల్పించాలన్నారు. గ్రామ స్థాయిలో చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలు వేసి ఎవరూ ఏ పని చేయాలో అనే విషయాలను చర్చించి అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో సదాశివపేట సీడీపీవో రేణుక, డీసీపీవో రత్నం, మెడ్వాన్ సెక్రెటరీ మధుసూదన్ రెడ్డి, మహితా స్టేట్ కో ఆర్డినేటర్ బాలచందర్, జిల్లా మహిత సమన్వయ కర్త విజయరేఖ, చైల్డ్ లైన్ కో ఆర్డినేటర్ యాదగిరి, సఖి సెంటర్ సభ్యుడు వసంత్, వివిధ గ్రామల వీఎల్‌సీపీసీ కమిటీ సభ్యులు, గ్రామాల సర్పంచ్‌లు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశావర్కర్లు, ఐసీడీఎస్ సూపర్ వైజర్లు పాల్గొన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...