ప్లాస్టిక్‌భూతాన్ని తరిమేద్దాం !


Fri,July 19, 2019 02:48 AM

నర్సాపూర్ రూరల్ : ప్లాస్టిక్ భూతాన్ని తరిమేయాలని ప్రభుత్వం, కలెక్టర్ ఇచ్చిన ఆదేశానుసారం గ్రామపంచాయతీల పాలకవర్గ సభ్యులు నడుంబిగించారు. గ్రామాలను ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దడానికి గ్రామస్తులు, యువకులు ముందుకు సాగుతున్నారు. ప్లాస్టిక్ వలన జరిగే అనర్థాలను తెలుసుకున్న గ్రామస్తులు వాటిని పూర్తిగా నిర్మూలించడానికి కంకణం కట్టుకున్నారు. ప్రతి గ్రామంలో గ్రామపంచాయతీ సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు, పంచాయతీ కార్యదర్శులు, యువకులు గ్రామస్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్లాస్టిక్ ఏరివేతలో భాగస్వాములవుతున్నారు. గ్రామంలో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి సంచుల్లో నిల్వ చేస్తున్నారు. పోగైన ప్లాస్టిక్ వ్యర్థాలను నర్సాపూర్ మండలానికి తరలించి అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో హైదరాబాద్‌లోని నాచారం ప్రాంతానికి తరలిస్తారు. అక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలు రీసైక్లింగ్ అవ్వడం జరుగుతుంది. గ్రామాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలిగించాలనే ముఖ్య సంకల్పంతో ప్రభుత్వం, కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని 12 రోజుల క్రితం ప్రారంభించడం జరిగింది. గ్రామాల్లో మహిళలు సైతం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు. ప్రస్తుతం నర్సాపూర్ మండల పరిధిలోని గ్రామాలనుంచి 180 సంచుల ప్లాస్టిక్‌ను సేకరించడం జరిగింది. అలాగే రెండవ విడుతగా గ్రామస్తులు ఆరుబయట వేయకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అవసరమైతే ప్లాస్టిక్‌ను ఆరుబయట వేసిన వారికి జరిమానా విధిస్తామని అధికారులు తెలిపారు. ఏరివేసిన ప్లాస్టిక్‌ను రీసైక్లింగ్ చేయడం ద్వారా మంచి ఆదాయం కూడా చేకూరుతుంది. ప్లాస్టిక్ వ్యర్థాలు భూ గర్భంలో కలిసిపోయి వందల సంవత్సరాల వరకు అలానే ఉండటం వలన చాలా అనర్థాలు జరుగుతాయని భావించి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ప్లాస్టిక్ వర్థాలు మురుగుకాలువల్లో పేరుకుపోవడం మూలంగా వర్షపు నీరు రోడ్లపై, వీధుల్లో చేరి ప్రజలు ఇబ్బందులకు గురవుతారు.

99
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...