వర్షం కోసం ప్రత్యేక పూజలు


Fri,July 19, 2019 02:45 AM

చిలిపిచెడ్: మండల పరిధిలోని అజ్జమర్రి గ్రామ మహిళలు వర్షాలు కురవాలని కప్పతల్లి ఆట ఆడారు. గురువారం ప్రధాన వీధులు గుండా తిరుగుతూ వర్షాలు కురవాలని వానదేవుడు కరుణించాలని మహిళలు ఆట ఆడుతూ కోరారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పరశురాంరెడ్డి, మహిళలు పాల్గొన్నారు.

హనుమాన్ ఆలయంలో...
మండల పరిధిలోని అజ్జమర్రి గ్రామంలో హనుమాన్ ఆలయంలో వర్షం కోసం ప్రత్యేక పూజలు చేశారు. అలాగే గ్రామ భజన భక్తి మండలి ఆధ్వర్యంలో భక్తులు భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పరశురాంరెడ్డి మాట్లాడుతూ వర్షాలుపడి పంటలు సక్రమంగా పండాలని ఆలయంలో భజన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. కార్యక్రమంలో భజన భక్తులు, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

91
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...