రోటరీక్లబ్ సేవలను విస్తరిస్తాం


Fri,July 19, 2019 02:45 AM

నర్సాపూర్,నమస్తేతెలంగాణ: రోటరీక్లబ్ సేవలను మారుమూల గ్రామాలకు విస్తరిస్తామని రోటరీక్లబ్ జిల్లా చైర్మన్ లింగంగౌడ్ అన్నారు. గురువారం నర్సాపూర్ రోటరీక్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం స్థానిక టీఎన్‌జీవో భవనంలో జరిగింది. ఈ కార్యక్రమానికి రోటరీక్లబ్ జిల్లా చైర్మన్ లింగంగౌడ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోటరీక్లబ్ ప్రపంచ వ్యాప్తంగా 223 దేశాల్లో సేవలను అందిస్తుందని అన్నారు. సామాజిక సేవాకార్యక్రమాలలో మౌలిక సదుపాయల కల్పనలో రోటరీక్లబ్ ముందుంటుందని చెప్పారు. రోటరీక్లబ్ ఆధ్వర్యంలో ఇప్పటికే ఎన్నో సామాజిక సేవాకార్యక్రమాలను చేపడుతున్నామని అందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలకు మినరల్‌వాటర్ ప్లాంటులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అలాగే విద్యావ్యాప్తికి అధిక ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. నర్సాపూర్ ప్రాంతంలో రోటరీక్లబ్ సేవలను నూతన కార్యవర్గం సహకారంతో అందిస్తామని అన్నారు. అనంతరం రోటరీక్లబ్ నర్సాపూర్ నూతన అధ్యక్షుడిగా నర్సింహారెడ్డితో పాటు ప్రధాన కార్యదర్శిగా నాగరాజుగౌడ్‌లు ఎన్నికయ్యారు. వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో రోటరీక్లబ్ జిల్లా ప్రతినిధి గుండం మోహన్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు వాల్దాస్ మల్లేశ్‌గౌడ్, ఇతర ప్రతినిధులు శ్రీనివాస్‌గుప్త, వేణుచారి, నాగరాజు, మధుశ్రీ పాల్గొన్నారు.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...