ఆర్‌వీఎం మెగా హెల్త్ క్యాంపునకు విశేష స్పందన


Fri,July 19, 2019 02:44 AM

తూప్రాన్, నమస్తే తెలంగాణ / తూప్రాన్ రూరల్ : పేదలకు ఉచితంగా మెరుగైన వైద్య సేవలందించేందుకు మెగా హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయడం అభినందనీయమని మాజీ రాష్ట్ర ఫుడ్స్ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి, మాజీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ భూంరెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు వంటేరు ప్రతాప్‌రెడ్డిలు అన్నారు. టీఆర్‌ఎస్ నాయకుడు, హైకోర్టు న్యాయవాది వెంకటస్వామి సహకారంతో ఆర్‌వీఎం చారిటబుల్ ట్రస్టు దవాఖాన సౌజన్యంతో తూప్రాన్‌లోని షిరిడీ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఆవరణలో గురువారం ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంపును మాజీ రాష్ట్ర ఫుడ్స్ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి ప్రారంభించగా మాజీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ భూంరెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు వంటేరు ప్రతాప్‌రెడ్డిలు సందర్శించి వైద్య పరీక్షలను పరిశీలించారు. క్యాంపునకు తూప్రాన్ పట్టణంతో పాటు పరిసర గ్రామాల నుంచి భారీగా ప్రజలు తరలి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. మాజీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ భూంరెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు వంటేరు ప్రతాప్‌రెడ్డిలు ప్రజలకు అందించే వైద్యసేవల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో ఉచిత వైద్యసేవలు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. ఒక్క ఆర్‌వీఎం దవాఖాన ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాంపు వంటి క్యాంపులు అన్ని దవాఖానల వారు గ్రామాల్లో విరివిగా ఏర్పాటు చేయాలన్నారు. క్యాంపు వైద్యులు క్యాంపునకు వచ్చిన వారికి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారిని దవాఖానకు రెఫర్ చేశారు. అనంతరం అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. వైద్యులు రాకేశ్, రమేశ్, గనేశ్, శృతి, ఇంద్రజ, శైలజలతో పాటు మార్కెటింగ్ మేనేజర్ లక్ష్మణ్, ఎగ్జిక్యూటీవ్‌లు కల్యాణ్, గణేశ్‌రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు, మనోహరాబాద్ సర్పంచ్ మహిపాల్‌రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ శ్రీశైలంగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ దీపక్‌రెడ్డి, నాయకులు రమ్య, రాఘవేందర్‌గౌడ్, సత్యనారాయణ గౌడ్, గుమ్మడి శ్రీనివాస్, నారాయణ గుప్తా, వెంకటేశం గుప్తా, మామిడి వెంకటేశ్, ఉపేందర్, అశోక్‌లతో పాటు ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు, పలువురు నాయకులు పాల్గొన్నారు. కాగా ఆలయంలో పూజలు నిర్వహించిన సందర్భంగా ఆలయంలో వారికి వెంకటస్వామి శాలువాలతో ఘనంగా సత్కరించారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...