గాలికుంటు వ్యాధి నివారణ టీకా తప్పనిసరి


Thu,July 18, 2019 03:23 AM

తూప్రాన్ రూరల్: పాడి పశువులను సంరక్షించడం కోసమే గ్రామాల్లో పశువైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తూ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా వేస్తున్నామని పశుసంవర్ధక శాఖ రాష్ట్ర మానిటరింగ్ ఆఫీసర్ షకీల్ అన్నారు. తూప్రాన్ మండలం మల్కాపూర్‌లో బుధవారం పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. అనంతరం తూప్రాన్ ఉమ్మడి మండలంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా వేస్తున్న తీరు, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో తరచూ వచ్చే ఈ వ్యాధిని నిర్మూలించడం కోసమే గ్రామాల్లో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేస్తున్నామన్నారు. ఆయా గ్రామాల్లోని పశువులకు తప్పకుండా ఈ టీకాను వేయించాలని రైతులకు, పశువుల కాపరులకు సూచించారు. కార్యక్రమంలో పశువైద్య శాఖ ఏడీ వెంకటయ్య, తూప్రాన్ మండల పశువైద్యాధికారి డాక్టర్ సుధ, జేవీవోలు సుదర్శన్‌పాణి, సత్తయ్య, సిబ్బంది వజీదా, మల్లేశ్, గోపాలమిత్రలు అశోక్, శ్రీనివాస్‌లతో పాటు రైతులు, పశువుల కాపరులు పాల్గొన్నారు.

104
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...