మీదే బాధ్యత..


Thu,July 18, 2019 03:23 AM

మెదక్ ప్రతినిధి, నమస్తేతెలంగాణ : అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయించే బాధ్యత మీదేనని పార్టీ నేతలంతా సమన్వయంగా పనిచేసి అద్భుత ఫలితాలు సాధించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సూచించారు. వరుస ఎన్నికల్లో విజయం సాధించినట్లుగానే జరుగబోయే మున్సిపల్ ఎన్నికల్లో జిల్లా సత్తాచాటాలని చెప్పారు. సమన్వయంతో పనిచేసి అన్ని మున్సిపాలిటీలపై గులాబీ జెండాలు ఎగురవేయాలని సూచించారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో రాష్ట్ర పార్టీ నేతలతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ ఎన్నికల్లో వ్యవహరించాల్సిన వ్యూహాలపై నేతలకు ముఖ్యమంత్రి దిశానిర్ధేశం చేశారు. అలాగే జిల్లా పార్టీ కార్యాలయ నిర్మాణానికి సంబంధించిన రూ.60లక్షలకు సంబంధించిన చెక్కును, భవన నిర్మాణ నమూనాను ఎమ్మెల్యేకు అందించారు. ఇటీవల మెదక్‌లో భవన నిర్మాణానికి భూమిపూజ చేసిన విషయం తెలిసిందే. కాగా వచ్చే దసరా పండుగలోగా కార్యాలయ నిర్మాణం పూర్తి చేయించి అందుబాటులోకి తీసుకురావాలని సీఎం సూచించారు. నమూనా ప్రకారం భవనాన్ని సకల హంగులతో నిర్మించాలన్నారు. దగ్గరుండి నిర్మాణ బాధ్యతలు చూసుకోవాలని ఎమ్మెల్యేకు ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఒకే నమూనాలో బిల్డింగ్ నిర్మాణాలు చేపట్టనున్న నేపథ్యంలో ఆ నమూనాను సీఎం ఎమ్మెల్యేకు అందించారు. ఇదిలా ఉండగా జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో మనదే హవా ఉండాలని చెప్పారు. కాగా నిర్మాణం కాబోతున్న జిల్లా పార్టీ కార్యాలయం పార్టీకి అన్ని రకాలుగా ఉపయోగపడాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించుకునేందుకు, శిక్షణ ఇచ్చే విధంగా ఉంటుందన్నారు. జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపయోగపడే విధంగా ఉండాలన్నారు. కాగా సిద్దిపేట జిల్లా నుంచి మాజీమంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు, సంగారెడ్డి నుంచి మాజీ ఎమ్మెల్యే చింతాప్రభాకర్ సమావేశానికి హాజరయ్యారు.

దసరా వరకు టీఆర్‌ఎస్ కార్యాలయ భవన నిర్మాణం పూర్తి
సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటాం. దసరా వరకు జిల్లా కేంద్రమైన మెదక్‌లో టీఆర్‌ఎస్ పార్టీ భవన నిర్మాణం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. పార్టీ నిర్మాణ బాధ్యతలను నాపై ఉంచినందుకు సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు. 33 జిల్లాల్లో ఒకే నమూనాతో కూడిన భవన నిర్మాణం జరప తలపెట్టామని, అందుకు అనుగుణంగా నమూనాను సీఎం నాకు అందించారు. పార్టీ కార్యాలయ నమూనాతో పాటు రూ. 60లక్షల చెక్కును నాకు అందించారు. దసరా వరకు టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయ భవనం నిర్మిస్తాం. సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశం నిర్ణయించి సభ్యత్వం, జిల్లా పార్టీ కార్యాలయ భవన నిర్మాణం తదితర అంశాలపై చర్చించారు.

83
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...