పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సైనికులుగా పని చేయాలి


Wed,July 17, 2019 12:42 AM

మెదక్, నమస్తే తెలంగాణ: పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సైనికులుగా పని చేయాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. మెదక్ మున్సిపాలిటీలో విలీనమైన ఔరంగాబాద్‌కు చెందిన పలుపార్టీలకు చెందిన ప్రసాద్‌యాదవ్, శ్రీనివాస్, రమేశ్, రాజు, వెంకట్, యాదగిరి, సిద్దిరాములుతో పాటు 50 మంది యువకులు మంగళవారం హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్‌ల సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా పద్మాదేవేందర్‌రెడ్డి వారికి గులాబీ కండువా కప్పి టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలు విశ్వసిస్తూ పార్టీలోకి వస్తున్నారన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి గులాబీ జెండా ఎగురడం ఖాయమన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి కృష్ణాగౌడ్, నాయకులు జీవన్‌రావు, ప్రసాద్ పాల్గొన్నారు.

75
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...