భూసమస్యల పరిష్కారం


Wed,July 17, 2019 12:41 AM

నర్సాపూర్,నమస్తేతెలంగాణ: రెవెన్యూ గ్రామసభలతో జిల్లాలో పేరుకుపోయిన భూసమస్యలు పరిష్కారం అవుతాయని కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. మంగళవారం నర్సాపూర్ పట్టణంలోని మణికొండ కల్యాణ మండపంలో రెవెన్యూ గ్రామసభలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ధర్మారెడ్డి, ఆర్డీవో అరుణారెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ గ్రామసభలకు వచ్చిన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న భూసమస్యలు పరిష్కారం కోసమే మండల స్థాయిలో గ్రామసభలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పార్ట్‌బీలో ఉన్న సమస్యలతో పాటు భూరికార్డులలో ఉన్న సమస్యలు పరిష్కరించి సర్వేలు జరిపి అసలైన లబ్ధిదారులకు భూములు అందే విధంగా చూస్తామని తెలిపారు. ఫౌతిలు, మ్యూటేషన్లు, పేర్లు తప్పులు, సర్వేనంబర్లు రాకపోవడం, విస్తీర్ణం ఎక్కువ, తక్కువలు రాకపోడం వంటి వాటిపై ఫిర్యాదులు తీసుకొని రికార్డుల్లో పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. నర్సాపూర్ మండలంలో కార్యక్రమంలో జెడ్పీటీసీ బాబ్యానాయక్, ఎంపీపీ జ్యోతి నాయక్, తహసీల్దార్ భిక్షపతి, సీనియర్ అసిస్టెంట్ నాగరాజు, వీఆర్‌వోలు, గ్రామ సేవకులు, ప్రజలు పాల్గొన్నారు.

79
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...