పంచాయతీ బడ్జెట్ ఆన్‌లైన్‌లో నమోదు


Wed,July 17, 2019 12:41 AM

తూప్రాన్, నమస్తేతెలంగాణ : గ్రామ పంచాయతీ బడ్జెట్ పూర్తి వివరాలు ఆన్‌లైన్ కానున్నాయని ఇప్పటికే ఆ దిశగా చర్యలు ప్రారంభించినట్లు జిల్లా పంచాయతీ అధికారి హనోక్ తెలిపారు. తూప్రాన్ మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీల వివరాలు ఆన్‌లైన్ లో నమోదు పక్రియను మంగళవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి ఎంపీడీవో రాఘవరావుతో పాటు గ్రామ పంచాయతీల కార్యదర్శులతో మాట్లాడారు. గ్రామ పంచాయతీలకు వస్తున్న రాబడి ,ఖర్చుల పూర్తి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. సంవత్సర కాలం పాటు పూర్తి బడ్జెట్ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. ప్రతి మూడు నెలలకు ఒక సారి మేజర్ గ్రామ పంచాయతీలను డీపీవో, మిగిలిన గ్రామ పంచాయతీల ఆన్‌లైన్ బడ్జెట్ వివరాలను ఆయా మండలాల ఈవోపీఆర్డీలు పరిశీలించాల్సింటుందని వివరించారు. పరిశీలించిన తర్వాత వివరాలను అప్‌లోడ్ చేయాల్సి వస్తుందని తెలిపారు. జిల్లాలోని 469 గ్రామ పంచాయతీలలోని పూర్తి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నామని వివరించారు. వివరాలలో తప్పులు చోటు చేసుకుంటే సదరు గ్రామ పంచాయతీలకు నోటీస్‌లు జారీ చేసి సరి చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని వివరించారు. గ్రా మ పంచాయతీల పరిశీలన వివరాలను షెడ్యూల్ రూపంలో ప్రణాలికను తయారు చేయాల్సి ఉంటుందని తెలిపారు. షెడ్యూల్ ప్రకారం గ్రామ పంచాయతీ ఆన్‌లైన్ పరిశీలన జరుగుతుందని తెలిపారు. పూర్తి వివరాలను పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్‌కు పంపాల్సి ఉంటుందన్నారు. గ్రామ పంచాయతీల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడానికి జిల్లాలోని ఎంపీడీవో, ఈవోపీఆర్డీలను అప్రమత్తం చేస్తున్నానని మంగళవారం చిన్నశంకరంపేట, చేగుంట, తూప్రాన్ మండలాల ఎంపీడీవో, ఈవోపీఆర్డీ, గ్రామ పంచాయతీ కార్యదర్శులతో సమావేశాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మూడు రోజులుగా ఈ ప్రకియ కొనసాగుతుందని వారం రోజుల్లోపూ పూర్తి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయబడుతుందని వెల్లడించారు.

ప్లాస్టిక్ నిషేధంలో జిల్లా ముందుంది : డీపీవో హనోక్.
ప్లాస్టిక్ నిషేధంలో మెదక్ జిల్లా ముందుంది. జిల్లాలోని ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో ఇప్పటికి సుమారు 50 వేల కిలోల ప్లాస్టిక్‌ను సేకరించామన్నారు. తూప్రాన్, మనోహరాబాద్ మండలాల నుంచి సుమారు 4 వేల కిలోల ప్లాస్టిక్‌ను సేకరించినట్లు తెలిపారు. సేకరించిన ప్లాస్టిక్‌ను రీ సైక్లింగ్ కోసం నగరంలోని నాచారం పారిశ్రామిక కేంద్రానికి పంపినట్లు తెలిపారు.

నేటి నుంచి తనిఖీలు.. జరిమానాలు
నేటి నుంచి జిల్లాలో తనిఖీలు చేపడుతమన్నారు. ప్లాస్టిక్‌ను వినియోగదారులకు ఇచ్చే వ్యాపార సముదాయాలపై దాడులు నిర్వహిసామని తెలిపారు. వారికి జరిమానాలు విధిస్తామన్నారు. అప్పటికీ ప్లాస్టిక్‌ను నిషేధించని వారిపై అవసరమైతే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజ్రాప్రతినిధులు పూర్తి సహకారం అందించాల్సి ఉంటు దన్నారు.

78
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...