ఇంకుడు గుంతలతో నేసమృద్ధిగా జలాలు


Wed,July 17, 2019 12:41 AM

రామాయంపేట: భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో రైతులు సంయమనం పాటించి బోరుబావులను తవ్వుకోవద్దని తవ్వితే నష్టాల పాలవుతారని ట్రెయినీ కలెక్టర్ రాజశ్రీ, జిల్లా వ్యవసాయశాఖ అధికారి పరశు రాంనాయక్ అ న్నారు. మంగళవారం జలశక్తి కార్యక్రమంలో భాగంగా నిజాంపేట మండలం నందిగామ గ్రామాన్ని అధికారుల బృందం సందర్శించారు. పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ట్రెయినీ కలెక్టర్ రాజశ్రీ పాల్గొన్నారు. ముందుగా గ్రామంలోని రైతుల కోరిక మేరకు చెరుకు,మొక్కజొన్న పంటలను పరిశీలించి రైతులు, వ్యవసాయశాఖ అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు.అనంతరం పంచాయతీ కార్యాలయంలో గ్రామ రైతులతో రౌండ్‌టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు సలహాలిచ్చారు. మండల వ్యాప్తంగా భూగర్భ జలాలు లోతుకు వెళ్లిపోయాయన్నారు. నీరు సమృద్ధిగా పైకి రావాలంటే రైతులు బోరుబావులను తవ్వడం తగ్గించుకోవాలన్నారు. నీరు రావడంలేదు కదా అని బావులను తవ్విస్తే నష్టపోయేది రైతు అనేది మరువద్దన్నారు. ఇంకుడు గుంతలు, నీటి కుంటల మూలంగా అడుగంటిన నీటిని భూగర్భ జలా లు పెంచుకోవచ్చన్నారు. వర్షాభావం లేనందున రైతు లు వరి, మొక్క జొన్న పంటలను విత్తుకోవద్దన్నారు. కేవలం ఆరుతడి పంటలనే విత్తుకోవాలన్నారు. నందిగామ గ్రామంలో ప్రధాన వీధుల్లో మొక్కలను నాటారు.ఈ కార్యక్రమంలో ఏపీడీ ఉమాదేవి,రామాయంపేట ఏడీఏ వసంత సుగుణ,రామాయంపేట,నిజాంపేట ఎంపీడీవోలు యాదగిరిరెడ్డి,వెంకటలక్ష్మి, నిజాంపేట ఎంపీపీ సిద్ధిరాములు, జెడ్పీటీసీ విజయ్‌కుమార్,వైస్ ఎంపీపీ ఇందిరా కొండల్‌రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ అందె కొండల్‌రెడ్డి, ఏవో సతీష్, ఏపీవో రాజ్‌కుమార్ మాజీ ఎంపీపీ సంపత్, నిజాంపేట సర్పంచ్ అనూష, నందిగామ సర్పంచ్ లద్ద ప్రీతి,సురేశ్,ఉపసర్పంచ్ గొల్ల రాజం, బాలయ్య, నర్సింహులు కార్యదర్శి మహ్మద్ అరిఫ్ హుస్సేన్,ప్రేమలత,ప్రవీణ ఉన్నారు.

81
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...