గడ పర్యటనతో కదిలిన యంత్రాంగం


Tue,July 16, 2019 03:54 AM

తూప్రాన్ రూరల్ : గడ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి చొరవతో తూప్రాన్ మండల అధికార యంత్రాంగం కదిలిదింది. మండలం దాతర్‌పల్లిలో రెండు రోజుల క్రితం పర్యటించి అపరిష్కృతంగా నెలకొన్న సమస్యల పరిష్కారానికి అధికారులు చొరవ చూపించాలని ఆయన ఆదేశించడంతో అసంపూర్తిగా నిలిచిపోయిన బస్‌షెల్టర్ నిర్మాణం పనులు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఇక్కడ నెలకొన్న సమస్యలు సీఎం కేసీఆర్ దృష్టికి వెళ్లడంతో సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో తూప్రాన్ మండలం దాతర్‌పల్లి గ్రామస్తుల కరెంట్ కష్టాలు తీరాయి. అటు వ్యవసాయానికి, ఇటు గృహవసరాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తున్నారు. రూ.30లక్షల విలువ చేసే విద్యుత్ పనులు పూర్తి కావడంతో గ్రామస్తుల్లో సంతోషం వ్యక్తమవుతున్నది. వరాల్లోకి వెళ్లితే.. తూప్రాన్ మండలం దాతర్‌పల్లిలో వ్యవసాయం మీద ఆధారపడి జీవించే వారి కుటుంబాల సంఖ్య అధికంగా ఉంటుంది. ఇక్కడ వ్యవసాయ రైతాంగానికి, కుటుంబాల సంఖ్యకు అనుగుణంగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. స్థానిక అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా ఫలితం కన్పించలేదు. గతేడాది ఆగస్టు15న మల్కాపూర్‌లో కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించడం కోసం సీఎం కేసీఆర్ వచ్చారు. ముఖ్యమంత్రి మల్కాపూర్‌కు వరాల జల్లు ప్రకటిస్తుండగానే దాతర్‌పల్లికి చెందిన పిట్లసాయిబాబా తమ గ్రామంలో నెలకొన్న సమస్యల గురించి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన సీఎం కేసీఆర్ దాతర్‌పల్లిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటూ సంబంధిత అధికారులను ఆదేశించారు. దీంతో ఉన్నతాధికార యంత్రాంగం అప్పట్లో కదిలింది. వెంటనే అధికారులు దాతర్‌పల్లికి చేరుకొని గ్రామంలో పర్యటించారు. గ్రామంలో నెలకొన్న కరెంట్ సమస్యలకు కారణాలు గ్రామస్తుల నుంచి అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ రంగానికి కావాల్సిన రెండు త్రీఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్‌లను తీసుకొచ్చి బిగించారు..దీంతో పాటే గృహవసరాలకు అవసరమైన మూడు సింగిల్‌ఫేజ్ (25కేవీఏ)విద్యుత్ ట్రాన్స్‌పార్మర్‌లు ఏర్పాటు చేశారు. పంట పొలాలకు, గ్రామంలోని పలు వీధులకు కావాల్సిన 134 విద్యుత్ స్తంబాలను దాతర్‌పల్లికి తీసుకొచ్చి వాటిని అమర్చారు. వీటి ఏర్పాటు అనంతరం గ్రామ రూపురేఖలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇస్లాంపూర్ రోడ్డు నుంచి గుండ్రెడ్డిపల్లి వెళ్లే మార్గం వరకు విద్యుత్ స్తంబాలు ఏర్పాటు చేయడంతో వ్యవసాయ రైతాంగానికి కావాల్సిన త్రీఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్లను బిగించడంతో లోఓల్టేజీ సమస్య లేకుండా పోయింది.సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ నెరవేరినందుకు గ్రామస్తులు మురిసిపోతున్నారు.

అసంపూర్తి పనులపై ప్రత్యేక దృష్టి సారించిన గడ ప్రత్యేక అధికారి
అయితే గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు, బస్‌షెల్టర్ పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. దీంతో గడ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి గత 2 రోజుల క్రితం గ్రామంలో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. గ్రామ ప్రధాన కూడలి నుంచి సుమారు 200 మీటర్ల సీసీ రోడ్డు, గ్రామంలోని డ్రైనేజీల నిర్మాణాలకు అంచనా వ్యయాలను సిద్ధం చేయాలని అక్కడే ఉన్న అధికారులను ఆయన ఆదేశించారు. అలాగే గ్రామ చౌరస్తాలో అసంపూర్తిగా మిగిలిపోయిన బస్ షెల్టర్ నిర్మాణం పనులను వేగవంతం చేయాలని ఆదేశించడంతో వెంటనే దానికి కావాల్సిన ఇసుక, కంకరను తెప్పించారు. అయితే మిగిలిపోయిన పనులను పూర్తి చేయించడానికి అధికార యంత్రాంగం నిమగ్నమైంది. దీంతో పాటే గ్రామవసరాలను గుర్తించి తమకు నివేధికను పంపించాలని ఆయన ఆదేశించారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...