పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట


Tue,July 16, 2019 03:53 AM

చేగుంట: పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండలకేంద్రమైన చేగుంటలోని సాయిబాలాజీ గార్డెన్‌లో 52 మందికి రూ.49,81,916ల కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామలింగారెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాల అభ్యున్నతితో పాటు ఆడ బిడ్డ పుట్టిన ఇంట్లో తల్లిదండ్రులకు భారం కావద్దనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ పథకం కింద రూ.లక్షా 116 రూపాయలను ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన చెక్కులను బ్యాంకులో వేసుకొని వచ్చిన డబ్బులతో వృథాగా ఖర్చులు చేయకుండా పెండ్లికి తెచ్చిన అప్పులను కట్టుకోవాలని సూచించారు. వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు, బీడీ , చేనేత, గీతా కార్మికులకు కూడా పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్‌ఎస్ అన్నారు. రైతులకు అందిస్తున్న పెట్టుబడి సాయం, కాలువల ద్వారా సాగునీరుతో రైతులకు వ్యవసాయం సాగుపై ఆసక్తి పెరిగిందన్నారు. మిషన్‌భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్, ఎంపీటీసీ అయిత వెంకటలక్ష్మి, చేగుంట సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మంచికట్ల శ్రీనివాస్, ఉప సర్పంచ్ సురేఖ, తూప్రాన్ ఆర్డీవో శ్యాంప్రకాశ్, తహసీల్దార్ గోవర్దన్, ఎంపీడీవో ఉమాదేవితో పాటు వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, వీఆర్‌వోలు ఉన్నారు.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...