గజ్వేల్ నియోజకవర్గంలో 80వేలకు పైగా సభ్యత్వాలు


Tue,July 16, 2019 03:53 AM

తూప్రాన్, నమస్తే తెలంగాణ / మనోహరాబాద్ /తూప్రాన్‌రూరల్: గజ్వేల్ నియోజకవర్గంలో 80 వేలకు పైగా సభ్యత్వాలు జరుగునున్నాయని ఫుడ్స్ చైర్మన్ గంగుమల్ల ఎలక్షన్‌రెడ్డి అన్నారు. తూప్రాన్ మండల కేంద్రంలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ... ప్రజలు, మహిళలు, యువకులు స్వచ్ఛందంగా టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వాలను స్వీకరిస్తున్నారన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలోని ప్రతి మండలంలో లక్ష్యానికి మించి సభ్యత్వాలు జరిగాయన్నారు. నాయకులు, కార్యకర్తలు సభ్యత్వ నమోదులో చురుకుగా పాల్గొంటున్నారన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమపథకాలు పార్టీకి అండగా నిలిచాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా చరిత్రలో నిలువనుందన్నారు. ఐదో విడుత హరితహారంలో ప్రతి ఒక్కరూ పాల్గొని మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని కోరారు. రావెళ్లి, పోతరాజుపల్లి నాయకులు సభ్యత్వ నమోదు రశీదులను ఫుడ్స్ చైర్మన్‌కు అందించారు.
యావాపూర్, పోతరాజుపల్లిలో..
యావాపూర్, పోతరాజుపల్లిలో సేకరించిన క్రియాశీలక, సామాన్య సభ్యత్వాల సేకరణకు సంబంధించిన పుస్తకాలు, నగదును ఆత్మకమిటీ వైస్ చైర్మన్ బాబుల్‌రెడ్డి, రావెళ్లి మాజీ సర్పంచ్ మల్లేశ్‌యాదవ్‌లు సోమవారం ఎలక్షన్‌రెడ్డికి అందజేశారు. అనంతరం పోతరాజుపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పార్టీ ఊహించిన దానికంటే టీఆర్‌ఎస్ సభ్యత్వాల సేకరణ అధికంగా కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో పలువురు టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమాభివృద్ధి పథకాలే పార్టీని మరింత బలోపేతం చేస్తుందన్నారు. ముఖ్యంగా గజ్వేల్ నియోకవర్గంలోని కొనసాగుతున్న తూప్రాన్, మనోహరాబాద్ మండలాల నుంచి టీఆర్‌ఎస్ సభ్యత్వం జోరుగా కొనసాగుతుందన్నారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...