భూగర్భ జలాలను కాపాడుకోవాలి


Tue,July 16, 2019 03:53 AM

రామాయంపేట: భూగర్భ జలాలు భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా కాపాడుకోవాలని ట్రెయినీ కలెక్టర్ రాజశ్రీ అన్నారు.సోమవారం నిజాంపేట మండల కేంద్రానికి విచ్చేసిన ట్రెయినీ ఐఏఎస్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో కలిసి జలశక్తి ర్యాలీని ప్రారంభించారు.అనంతరం విద్యార్థులకు పాఠశాలలో,రైతులకు ఎంపీపీ కార్యాలయంలో జలశక్తి పథకంపై అవగాహన కల్పించారు.నిజాంపేట మండలం జలశక్తి అభియాన్ పథకంలో చేర్చబడిందన్నారు. జలశక్తిలో భాగంగా గ్రామాలలో ఉన్న ప్రజలందరూ నీటిని ఒడిసిపడితేనే జలా లు మనకు దక్కుతాయన్నారు. మండల వ్యాప్తంగా ప్రతి ఇంటింటికీ ఇంకుడు గుంతలు,పంట పొలాల వద్ద ఫాంపాండ్స్‌ను నిర్మించుకోవాలన్నారు. ఫాంపాండ్స్‌ను నిర్మించుకున్న వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50శాతం సబ్సిడీని ఇస్తుందన్నారు. అందుకోసం ప్రతిరైతు తమ పొలం వద్ద కచ్చితంగా ఫాంపాండ్స్‌ను నిర్మించుకోవాలన్నా రు. ఇం కుడు గుంతల వల్ల మురి కి కాల్వలు ఉండవన్నా రు. వాటితో భూమిలో ఉన్న జలాల సామర్ధ్యం పెరుగుతుందన్నారు. విద్యార్థులు తమ ఇండ్ల లో తల్లిదండ్రులకు భూ గర్భజలాలను ఎలా కా పాడుకోవాలో తెలుపాలన్నారు

మొక్కలను పెంచిన విద్యార్థులకు బహుమతులు: జెడ్పీటీసీ పంజ విజయ్‌కుమార్
పాఠశాలలో గాని తమ ఇండ్ల ఎదుట మొక్కలను కాపాడిన విద్యార్థులకు బహుమతులను తన స్వంతంగా అందజేస్తానని నిజాంపేట జెడ్పీటీసీ పంజ విజయ్‌కుమార్ అ న్నారు.ప్రభుత్వ పాఠశాలలో జలశక్తి సమావేశంలో మా ట్లాడారు.ప్రతి విద్యార్థి పర్యావరణ పరిరక్షణ కోసం కచ్చితంగా మొక్కలు నాటాలన్నారు.పాఠశాలలోనే కాకుండా తమ పంటపొలాలు,ఇండ్ల ఎదుట మొక్కలను నాటి దాని పరిరక్షణ బాధ్యతను కూడా విద్యార్థులే తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి పరశురాంనాయక్, ప్రత్యేక అధికారి యేసయ్య, నిజాంపేట ఎంపీడీవో వెంకటలక్ష్మి, ఎంపీపీ సిద్ధిరాములు ఉన్నారు.

82
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...