ఉన్నత లక్ష్యాలతో ముందుకెళ్లాలి


Tue,July 16, 2019 03:53 AM

రామాయంపేట : కార్పొరేట్ పాఠశాలల కంటే దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వాటి కనుగుణంగా విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో చదువుపై శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్లాలని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం రామాయంపేట ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక బాలికల పాఠశాలకు విచ్చేసిన ఎమ్మెల్యే డిజిటల్ క్లాసులను ప్రారంభించి, అనంతరం మొక్కలను నాటి, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు డిజిటల్ క్లాసుల కోసం దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం చేయడం చాలా గొప్పదన్నారు. దాతల సహకారంతో పాఠశాలను ముందుకు తీసుకువెళ్తున్న హెచ్‌ఎం.రాగి రాములును వారు అభినందించారు. డిజిటల్ క్లాసులతో విద్య మరింత సులభతరంగా ఉంటుందన్నారు. ఇంగ్లిష్‌పై విద్యార్థులు మక్కువ పెంచుకోండి కానీ తెలుగు భాషను మాత్రం మరువొద్దన్నారు. తెలుగు భాష మన కన్నతల్లిలాంటిదన్నారు. ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలకు దీటుగా అన్ని వనరులను సమకూరుస్తున్నదన్నారు. వాటికనుగునంగా విద్యావ్యవస్థ పెరుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో సన్న బియ్యంతో భోజనం పెట్టడమే గాకుండా ఉచితంగా విద్య, పాఠ్యపుస్తకాలు, ఫీజులు లేకుండా విద్యను అందజేస్తుందన్నారు. పట్టణంలో పాఠశాలకు స్థలం సేకరిస్తే తనవంతు సహాయంగా నూతన మాడల్ బిల్డింగ్‌కు నిధులను మంజూరు చేస్తానన్నారు. కార్యక్రమంలో రామాయంపేట ఎంపీపీ, జెడ్పీటీసీలు నార్సింపేట భిక్షపతి, సంధ్య, జిల్లా గ్రంథాలయాల డైరెక్టర్, మాజీ ఎంపీపీ పుట్టి విజయలక్ష్మి, జిల్లా విద్యాశాఖ నోడల్ అధికారి మధుమోహన్, సైన్స్ అధికారి రాజిరెడ్డి, ఎంఈవో నర్సింహులు, హెచ్‌ఎంలు రాగి రాములు, జయమ్మ, ప్రసన్నలక్ష్మి, శ్రీనువాస్, దత్తాత్రేయ కులకర్ణి, విక్రమాథిత్య, జిల్లా పీజీహెచ్‌ఎంల చైర్మన్ సుదర్శనమూర్తి, నాగేశ్వర్‌రావు, పుట్టి యదగిరి, సిద్ధిరాంరెడ్డి, నాగేశ్వర్ రెడ్డి, దేమె యాదగిరి, శారద రాజు, బాదె చంద్రం, దోమ చంద్రకళ, పాతూరి ప్రభావతి, మెట్టు యాదగిరి, లక్ష్మణ్ యాదవ్, లక్ష్మీనర్సింహులు, రాంమోహన్, తోట కిరణ్, నవాత్ నవీన్ తదితరులున్నారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...