ఎస్సై ఉద్యోగానికి ఎంపికైన చిల్వెర వాసి


Mon,July 15, 2019 12:22 AM

అల్లాదుర్గం: రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితుల్లో ఉన్న తల్లిని తండ్రి వదిలి పెట్టాడు,తల్లి కూలీ పని చే స్తూ కొడుకును చదివించి ప్రయోజకుడిగా తీర్చిదిద్దిం ది.తల్లి కష్టాలను చూసి కరిగిపోయిన కోడుకు రెట్టించిన కష్టంతో ఎస్సై పరీక్షకు సన్నద్ధమయ్యాడు.మొదటి ప్రయత్నంలో ఓడిపోయాడు. అయినా పట్టుదలతో తిరిగి ప్రయత్నించి గెలిచాడు. గ్రామీణ ప్రాంత నేప థ్యం నుంచి సమాజంలో ఉన్నత గుర్తింపు గల ఎస్సై కొలువులోకి అడుగుపెట్టబోతున్నాడు మేతరి రాజు...
అల్లాదుర్గం మండల పరిధిలోని చిల్వెర గ్రామానికి చెందిన మేతరి రాములు, మరియమ్మ దంపతులకు కోడుకు మేతరి రాజు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు.అప్పటి నుంచి రాజు తల్లి దగ్గర పెరిగాడు. రోజూ కూలీ పని చేస్తూ కొడుకును చదివించింది.పదోతరగతిలో మంచి మార్కులు సాధించాడు.దీంతో డీఆర్డీఏ నుంచి విజయవాడలోని చైతన్య కళాశాలలో ఉచితంగా ఇంటర్‌లో సీటు లభించింది.అక్కడ ఇంటర్‌ పూర్తి చేసి హైదరాబాద్‌లోని నిజాం కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాడు.మొదట 2016లో ఎస్సై నోటిఫికేషన్‌ పడగానే పరీక్షలకు సిద్ద్ధయ్యాడు.తొలి సాధనలో 3 మార్కుల్లో చేజారింది. 2018 నోటిఫికేషన్‌ పడగానే ఎస్సై ఉద్యోగానికి సన్నద్ధమయ్యాడు.శనివారం పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు విడుదల చేసిన ఫలితాల్లో సివిల్‌,ఆర్పిటీ(రైల్వే ప్రోటెక్షన్‌ ఫోర్స్‌) రెండిటిలో ఉద్యోగం సాధించాడు. కష్టానికి ఫలితం దక్కింది.ప్రజలకు న్యాయం జరిగేలా విధులను నిర్వహిస్తా.అమ్మను కంటికి రెప్పలా చూసుకుంటా.

131
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...