ఫలంబరీగా దుర్గామాత


Mon,July 15, 2019 12:22 AM

పాపన్నపేట: సుప్రసిద్ధ పుణక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గాదేవి ఆదివారం ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని భక్తులకు ఫలంబరీదేవి రూపంలో దర్శనమిచ్చారు. వేకువజామున ఆలయ అర్చకులు అమ్మవారికి అభిషేకం నిర్వహించి పలురకాల పండ్లతో అతిసుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఏడుపాయల భక్తజన సందోహంతో కిటకిటలాడింది. భక్తులు భారీగా తరలిరావడంతో పాక మండలి చైర్మన్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, ఈవో మోహన్‌రెడ్డిలు తగిన చర్యలు తీసుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు మంజీరా చెక్‌డ్యాం, మడుగులలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో బారులు తీరారు. భక్తుల తాకిడి ఎక్కువడా ఉండడంతో అమ్మవారి దర్శనానికి సమయం పట్టింది. ఫలాంబరిదేవిగా దర్శనమిచ్చిన వనదుర్గాదేవిని దర్శించుకొని భక్తులు తరించిపోయారు. మరికొందరు అమ్మవారికి బోనాలు, ఒడిబియ్యం. తలనీలాలు, కుంకుమార్చనలు సమర్పించి తమ తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఏడుపాయలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పాపన్నపేట ఎస్‌ఐ ఆంజనేయులు తమ సిబ్బందితో గట్టి పోలీసు బందోబస్తు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో సకల సౌకర్యాల కల్పనలో పాలక మండలి సభ్యులు సిబ్బంది రవికుమార్‌, శ్రీనివాస్‌, సిద్దిపేట శ్రీనివాస్‌, లక్ష్మీనారాయణ, మధుసూదన్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, శ్రీనివాస్‌శర్మ, మహేశ్‌, విఠల్‌, నరేశ్‌ పాల్గొన్నారు.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...