ప్లాస్టిక్‌ రహిత గ్రామంగా తీర్చిదిద్దాలి


Mon,July 15, 2019 12:22 AM

చిలిపిచెడ్‌: అంతారం గ్రామాన్ని ప్లాస్టిక్‌ రహిత గ్రామంగా తీర్చిదిద్దాలని సంగారెడ్డి జిల్లా డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్‌రావు గ్రామస్తులకు సూచించారు. ఆదివారం మండల పరిధిలోని అంతారం గ్రామంలో గ్రామ సర్పంచ్‌ అశోక్‌గౌడ్‌, మండల ఎంపీడీవో నర్సింహారెడ్డితో కలిసి స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలో ప్లాస్టిక్‌ కవర్‌లను వినియోగిస్తే వచ్చే అనర్థాలపై డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్‌రావు అవగాహన కల్పిస్తూ.. గ్రామస్తులతో పాటు ఆయన కూడా స్వచ్ఛభారత్‌ పాల్గొన్నారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశం డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ గ్రామంలో ప్రతిఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే గ్రామంలో ప్లాస్టిక్‌ కవర్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించుకోవాలన్నారు. గ్రామంలో చెత్తను రోడ్లులపై విచ్చలవిడిగా పడివేయొద్దని సూచించారు. రోడ్లులపై చెత్తను విచ్చలవిడిగా పారవేస్తే అట్టి చెత్త మురుగుకాల్వలలోకి చేరి పేరుకుపొయి దోమలు, ఈగలు అధికమై ప్రజలు రోగాల బారినపడే ప్రమాదముందన్నారు. జీర్ణకోశ సంబంధిత వ్యాధులు, క్యాన్సర్‌ సోకే అవకాశం ఉందన్నారు. తడిపొడి చెత్తను వేర్వేరుగా వేయాలన్నారు. రోగాలు రాకుండా నివారించుకోవాలంటే సంపూర్ణ పారిశుధ్యమే మంచి మార్గం అన్నారు. సంపూర్ణ పారిశుధ్యం కోసం గ్రామస్తులంతా సహకరించాలన్నారు. అలాగే ప్రతి ఆదివారం ఒక గంట గ్రామంలో గ్రామస్తులు అందరూ కలిసి స్వచ్ఛభారత్‌ కార్యక్రమం నిర్వహించుకోవాలని తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములై మొక్కలు నాటాలన్నారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వనాలు ఉంటేనే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ అశోక్‌గౌడ్‌, ఎంపీడీవో నర్సింహారెడ్డి, ఎస్‌ఐ మల్లయ్య, ఉప సర్పంచ్‌ నరహరి, గ్రామ కార్యదర్శి రవిశంకర్‌, గ్రామస్తులు యాదయ్య, సతీశ్‌గౌడ్‌, ప్రసాద్‌, నర్సింహులు, చంద్రశేఖర్‌గౌడ్‌ పాల్గొన్నారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...