సబ్బండ వర్ణాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం


Sat,July 13, 2019 11:15 PM

దుబ్బాక, నమస్తే తెలంగాణ: పేదల అభివృద్ధే లక్ష్యంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తన్నదని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. దుబ్బాకలో నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూం ఇండ్లను ఎమ్మెల్యే రామలింగారెడ్డి పరిశీలించారు. డబుల్ బెడ్‌రూంల కాలనీలో సమ్మక్క-సారలమ్మ దేవాలయంతో పాటు ఇతర దేవాలయాల నిర్మాణం కోసం స్థలాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. దుబ్బాకలో వెయ్యి డబుల్ బెడ్‌రూం ఇండ్లు నిర్మాణ పూర్తి దశలోకి చేరుకున్నాయి. ఈ కాలనీలో ప్రజలకు ఆధ్యాత్మిక వాతావరణం నెలకొల్పేందుకు దేవాలయాలను నిర్మించేందుకు ఎమ్మెల్యే సోలిపేట ప్రత్యేక దృష్టి సారించారు. ఇందుకు స్థానిక వేదాంతి వేలేటి జయరామశర్మతో స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామలింగారెడ్డి మాట్లాడుతూ...టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో సబ్బండ వర్ణాలకు సముచిత న్యాయం చేకూరిందన్నారు. రాష్ట్రంలో ఇండ్లు లేని పేదలుండకూడదన్న లక్ష్యంతో ముఖ్యంత్రి కేసీఆర్ డబుల్ బెడ్‌రూం ఇండ్లు నిర్మిస్తున్నారని తెలిపారు. పేదలాభివృద్ధి కోసం ప్రభుత్వం ఎన్నో రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. వీటిని సద్వినియోగపరచుకుని అభివృద్ధి సాధించాలని సూచించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు రొట్ట్టె రమేశ్, ఎల్లారెడ్డి, ఆస స్వామి, పర్స కృష్ణ తదితరులున్నారు.

90
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...