ఆరోగ్యలక్ష్మిపై అవగాహన


Sat,July 13, 2019 11:15 PM

వెల్దుర్తి: ఆరోగ్య సంరక్షణకే ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందిస్తుందని మండలంలోని ధర్మారం గ్రామ సర్పంచ్ శంకర్‌రెడ్డి అన్నారు. ఆరోగ్యలక్ష్మి పథకంపై శనివారం స్థానిక అంగన్‌వాడీ కేంద్రంలో గర్భిణులు, బాలింతలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు ఆరోగ్యంగా ఉండి, బలమైన ఆహారం తీసుకుంటేనే పుట్టబోయే బిడ్డ, పుట్టిన చిన్నారులు ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఇంటి వద్ద గర్భిణులు, బాలింతలకు సరైన పౌష్టికాహారం అందడం లేదనే, ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలలో పౌష్టికాహారం అందిస్తుందని దానిని కేంద్రాలలోనే తినాలన్నారు. చిన్నారుల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ సమావేశంలో అంగన్‌వాడీ టీచర్ వేదవతి, ఏఎన్‌ఎస్ ఏసుమణి, ఉప సర్పంచ్ రాములు, ఆశ కార్యకర్త భాగ్యలతో పాటు పలువురు గర్భిణులు, బాలింతలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

85
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...