కూచన్‌పల్లిని విత్తన భాండాగార కేంద్రంగా మార్చాలి


Sat,July 13, 2019 11:15 PM

మెదక్ ప్రతినిథి, నమస్తేతెలంగాణ : కూచన్‌పల్లిని విత్తనాభివృద్ధి గ్రామంగా తయారు చేసేందుకు అందరు సహకరించాలని సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. శనివారం కూచన్‌పల్లిని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ అసిస్టెంట్ మేనేజర్ ఆది నారాయణరెడ్డి సందర్శించారు. రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి ఫామ్ హౌజ్‌లో విత్తనాభివృద్ధి సంస్థ అసిస్టెంట్ మేనేజర్ ఆదినారాయణరెడ్డితో కలిసి కూచన్‌పల్లిని విత్తన భాండాగార కేంద్రంగా మార్చేందుకు ఈ విషయంపైన చర్చించారు.
అనంతరం ఎమ్మెల్సీ కలెక్టర్ ధర్మారెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. రైతులకు కావల్సిన మౌలిక సదుపాయాలు కల్పించాలని, మెదక్‌లో ఉన్న డీసీఎంఎస్ గోడౌన్‌లో విత్తన ప్రాసెసింగ్ కేంద్రం ఏర్పాటుకు పరిశీలించాలని కోరడంతో కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. 300 టన్నుల గోడౌన్ రహదారి సమీపానికి అందుబాటులో ఉందని వరి విత్తనోత్పత్తికి మెదక్ ప్రాంతం ఎంతో అనుకూలం అని అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా కరువు పరిస్థితులు ఉన్నా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున వరి పంట పండిస్తారని కలెక్టర్‌కు విత్తనాభివృద్ధి సంస్థ అసిస్టెంట్ మేనేజర్ ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి విన్నవించారు. ఆయన వెంట జిల్లా అధికారులు హవేళి ఘనపూర్ ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, సర్పంచ్ దేవగౌడ్, మాజీ సర్పంచ్ మహేందర్‌రెడ్డిలు తదితరుల ఉన్నారు.
విత్తన సంస్థ సహకరిస్తే రైతులకు
ఎంతో లాభం..
: ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి
విత్తన సంస్థ సహకరిస్తే ఈ ప్రాంత రైతులు ఎంతో లాభపడుతారు. రవాణా ఖర్చులు రైతుల మీద పడకుండా సంస్థ బరించేలా చర్యలు తీసుకోవాలని సంస్థ జనరల్ మేనేజర్ ఆదినారాయణరెడ్డిని కోరాం. గన్నీ బ్యాగులను సంస్థనే సరఫరా చేయాలి. డీసీఎంస్ గోడౌన్ కేటాయించం కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ధర్మారెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. ఆయన సానుకూలంగా స్పందించారు.

98
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...