లోక్ అదాలత్‌లో 81 కేసులు పరిష్కారం


Sat,July 13, 2019 11:14 PM

మెదక్ అర్బన్: లోక్ అదాలత్ లో కేసులను త్వరగా పరిష్కరించుకోవచ్చని జిల్లా 8వ అదనపు న్యాయమూర్తి నారయణ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ కోర్టుల చుట్టు తిరిగి సమయం ,డబ్బులను వృథా చేసుకోకుండా కక్షిదారులు రాజీపడి కేసులను త్వరగా పరిష్కరించుకోవాడనికి లోక్ అదాలత్‌ను సం ప్రందించాలని పేర్కొన్నారు. శనివారం జాతీయ లోక్ అదాలత్ ద్వారా 81 కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. ప్రమాద కేసులలో నష్టపరిహారంగా రూ.75వేలను కక్షిదారులకు ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి ఇప్పించినట్లు పేర్కొన్నారు. లోక్ అదాలత్‌లో మెదక్ సీనియర్ సివిల్ జడ్జి సుహాసిని, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది కక్షిదారులు పాల్గొన్నారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...