రాజీయే పరిష్కార మార్గం


Sat,July 13, 2019 11:14 PM

-జూనియర్ సివిల్ కోర్టు జడ్జి పవన్‌కుమార్
నర్సాపూర్ నమస్తేతెలంగాణ : కక్షిదారులు పంతాలకు పోకుండా రాజీపడటమే పరిష్కార మార్గమని జూనియర్ సివిల్ కోర్టు జడ్జి పవన్‌కుమార్ అన్నారు. శనివారం నర్సాపూర్ పట్టణంలోని జూనియర్ సివిల్ కోర్టులో జాతీయ మెగా లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం జాతీయ లోక్‌అదాలత్‌ను నిర్వహించామని తెలిపారు. లోక్‌అదాలత్‌ల ముఖ్య ఉద్దేశ్యం క్షణికావేశంతో నెలల తరబడి కోర్టుల చుట్టు తిరుగుతూ వారి సమయాన్ని , డబ్బులను వృథా చేసుకుంటున్నారని తెలిపారు. ఇలాంటి వారి మధ్య రాజీ కుదర్చడం కోసమే లోక్‌అదాలత్‌లను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కోర్టులలో పెండింగ్ కేసుల వల్ల పనిభారం పెరుగుతుందని అన్నారు. బలవంతంగా తాము ఎవరిని రాజీ కుదర్చబోమని ఇరువురు అంగీకరిస్తేనే రాజీ కుదుర్చుతామని పేర్కొన్నారు. ఇక్కడ రాజీకుదిర్చిన తర్వాత కేసులు సుప్రీంకోర్టుకు వెళ్లినా నిలబడవని తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ సీఐ సైదులు ఎస్సై సందీప్‌రెడ్డి, న్యాయవాదులు ఎక్బల్ అలీ జాఫర్, సత్యనారాయణ, శ్రీనివాస్, కందిప్రకాష్, స్వరూప రాణి తదితరులు ఉన్నారు.

79
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...