భావి శాస్త్రవేత్తలకు ఆహ్వానం


Sat,July 13, 2019 01:19 AM

మెదక్, నమస్తే తెలంగాణ: తరగతి గదిలో నేర్చుకున్న వివిధ పాఠ్యాంశాలను అర్థం చేసుకుని నిత్య జీవితంలో నూతన ఆవిష్కరణల వైపు ఆలోచన చేసేందుకు కేంద్రవిజ్ఞాన శాస్త్ర, సాంకేతిక విభా గం తొమ్మిదేళ్లుగా ప్రతి ఏటా ఇన్‌స్పైర్ మనక్ పురస్కారాలను అందజేస్తుంది. ఈ విద్యాసంవత్సరం ఉత్తమ భావి శాస్త్రవేత్తలను ఎంపిక చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ఈనెల 31 వరకు విద్యార్థులు ఎంచుకున్న అం శాన్ని ఇంటర్నెట్‌లో నామినేషన్ చేయాలి. విద్యార్థుల శాస్త్రీయ ఆలోచనలను ఆవిష్కరణల వైపు ప్రోత్సహించాలి. ప్రస్తుతం ఈ పథకాన్ని కేంద్ర విజ్ఞాన శాస్త్ర సాంకేతిక విభాగం, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. దేశ వ్యాప్తంగా పదిలక్షల మం ది బాలల ఆలోచనలకు సానబట్టే ప్రయత్నం కోసం తా జాగా మన ఇన్‌స్పైర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. భారత ఇన్‌స్పైర్ టెక్నాలజీ విభాగం ప్రధాన కార్యక్రమాల్లో దీనిని చేర్చి ంది.

6 నుంచి పదో తరగతి విద్యార్థుల వరకు
పాఠశాల స్థాయిలో ఆ రోతరగతి నుంచి పదోతరగతి చదువుతున్న 10 నుంచి 15 సంవత్సరాలలోపు విద్యార్థులకు చైతన్యవంతం చేసేందు కు రూపొందించారు. ప్రయోగాలపై అభిరుచి ఉన్న విద్యార్థులను ఎంపిక చేసి ప్రయోగాలను నేర్పిస్తారు. అయిదు అంశాలలో (బౌతిక, రసాయన, గణిత, జీవ, సామాజిక) విద్యార్థులు చేసిన ప్రయోగ వివరాలను ఇన్‌స్పైర్ మనక్‌కు పంపిస్తే పురస్కారానికి ఎంపిక చేసి ఆర్థికంగా ప్రోత్సాహం అందిస్తారు. ఈ పురస్కారానికి ఎంపికైన విద్యార్థులకు గతం లో రూ.5 వేలు మాత్రమే అందించే వారు. ప్రస్తు తం రూ.10 వేల నగదును అందిస్తున్నారు. విద్యార్థులకు ప్రయోగాలను నేర్పిస్తూ, వారితో ప్రయోగాల ను చేయించడానికి జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయులుకు శిక్షణ ఇస్తారు.

ఎంపిక ఇలా...
విద్యార్థులు తయారు చేసిన ప్ర యోగ అంశాలను జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ప్రదర్శిస్తారు. వీటిలో ఉత్తమమైన వాటిని ఎం పిక చేస్తారు. మొ దట జిల్లా స్థాయి లోప్రయోగాలను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి కి పంపిస్తారు.

రాష్ట్ర స్థా యిలో ఎంపికైన వాటిని జాతీ య స్థాయికి పంపుతారు. జాతీయ స్థాయిలో ఎంపికైన 50 ఉత్తమ ప్రదర్శనలను ఢిల్లీలో జరిగే ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రదర్శిస్తారు. విద్యార్థులు ప్రదర్శించిన వాటిలో కొన్నింటిని ఎంపిక చేసి ఇన్‌స్పైర్ మనక్ పురస్కారం కింద రూ. 10 వేల నగదును అందిస్తారు.

76
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...