ముమ్మరంగా సభ్యత్వాలు


Sat,July 13, 2019 01:19 AM

తూప్రాన్, నమస్తేతెలంగాణ: తూప్రాన్ పట్టణంలో టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వాలు ముమ్మరంగా సాగుతున్నట్లు రాష్ట్ర ఫుడ్స్ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి అ న్నారు. తూప్రాన్‌లో పలువురు క్రిస్టియన్‌లకు శుక్రవారం పార్టీ సభ్యత్వాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ఆశించిన దానికంటే కూడా పార్టీ సభ్యత్వాలు రెట్టింపయ్యాయని తెలిపారు. పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పని చేస్తున్నారని అన్నారు. ఇంటింటికీ తిరిగి సభ్యత్వాలు చేయిస్తున్నారని చెప్పారు. సామాన్య ప్రజ లు కూడా నేడు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సభ్యత్వాలు పొందుతున్నారంటే పార్టీపై ప్రజలకు ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను, చేపడుతున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు విజయం సాధిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ మం డల అధ్యక్షుడు శేఖర్‌గౌడ్, ఏఎంసీ వైస్ చైర్మన్ శ్రీశైలంగౌ డ్, ఆలయ డైరెక్టర్‌లు చంద్రారెడ్డి, వెంకటేశ్‌గుప్తా, మైనార్టీ సెల్ నాయకులు సత్తార్, నాయకులు సతీశ్‌లు పాల్గొనగా చిల్డ్రన్స్ హై స్కూల్ సిబ్బంది మోజస్, ప్రకాశ్, వరప్రసాద్, వెంకటేశ్‌లు సభ్యత్వాలు పొందారు.

ఊరూరా సభ్యత్వాలు నమోదు
కౌడిపల్లి: ఊరూరా టీఆర్‌ఎస్ సభ్యత్వాలు జోరుగా కొనసాగుతున్నాయి. ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి సభ్యత్వాలను స్వీకరిస్తున్నారు. శుక్రవారం తునికి గ్రామంలో టీఆర్‌ఎస్ సభ్యత్వనమోదును ఎంపీపీ దళావత్ రాజునాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రా జు నాయక్ మాట్లాడుతూ టీఆర్‌ఎస్ సభ్యత్వానికి మండలంలోని ప్రతి గ్రామంతో పాటు తండాలు సభ్యత్వాలను స్వీకరిస్తున్నామన్నారు. అలాగే పార్టీ సభ్యత్వం స్వీకరించిన ప్రతి ఒక్కరికి సీఎం బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హరిశ్చంద్‌తండా సర్పంచ్ లక్యానాయక్, టీఆర్‌ఎస్ నాయకులు అమర్‌సింగ్‌రాథోడ్, రహీం, శ్రీనునాయక్, శంకర్‌నాయక్ పాల్గొన్నారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...