గ్రామంలో పరిశుభ్రత భేష్


Sat,July 13, 2019 01:18 AM

తూప్రాన్ రూరల్: తూప్రాన్ మండలం మల్కాపూర్ గ్రామాన్ని శుక్రవారం సాయంత్రం పలువురు కేంద్ర బృందం సభ్యులు సందర్శించారు. కేంద్ర ప్రభుత్వ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ జాయింట్ సెక్రటరీ, జలశక్తి అభియాన్ జిల్లా కోఆర్డీనేటర్ గాయత్రిమిశ్రా, కేంద్ర అగ్రికల్చర్ డైరెక్టర్ రాజేశ్‌మాలిక్, సీడబ్ల్యుసీ కార్యదర్శి రఘురాంలు గ్రామంలోని పలు వీధుల్లో పర్యటించారు. గ్రామంలో జరిగిన పలు అభివృద్ధి పనుల గురించి క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించారు. వర్షపు నీరు వృథా కాకుండా గ్రామంలో గతంలోనే ఇంటింటికీ నిర్మించుకున్న ఇంకుడు గుంతల నిర్మాణాలను వారు స్వయంగా పరిశీలించారు. అనంతరం గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులు పరిశీలన చేశారు. సీసీ రోడ్లు, డంపింగ్‌యార్డు, సోలార్ లైట్లు రోడ్డుకు ఇరువైపులా నాటిన హరితహారం మొక్కలు, తడిపొడిచెత్తను వేరు చేసేందుకు గానూ నిర్మించిన సేంద్రియ ఎరువుల తయారికేంద్రాన్ని పరిశీలించి వారు సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్న రాక్‌గార్డెను చూసి వారు మంత్రముగ్ధులయ్యారు. గ్రామంలో ఎక్కడ చూసిన పచ్చదనం, పరిశుభ్రత కన్పించడంతో వారు ఆశ్చర్యపోయారు. ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా గ్రామంలో స్వచ్ఛభారత్ కార్యక్రమాలను నిర్వహిస్తూ గ్రామాన్ని పరిశుభ్రతలో ముందుంచుతున్నారని స్థానిక అధికార యంత్రాంగం కేంద్ర బృందం సభ్యులకు వివరించారు. కార్యక్రమంలో డీఆర్డీవో సీతారామారావు, తూప్రాన్ ఆర్డీవో శ్యాంప్రకాశ్, ఈవోపీఆర్డీ రాఘవరావు, ఏపీవో కృష్ణారెడ్డి, సర్పంచ్ మహాదేవి, ఎంపీటీసీ పంజాల వెంకటమ్మతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.

83
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...