భూగర్భ జలాలను పెంచాలి


Fri,July 12, 2019 01:44 AM

రామాయంపేట : ఇంటింటికీ ఇంకుడుగుంతలు నిర్మించుకుని భూగర్భ జలాల పెంపునకు పాటుపడాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి, జలశక్తి అభియాన్ కేంద్ర బృందం సభ్యురాలు గాయత్రీ మిశ్రా పేర్కొన్నారు. గురువారం కేంద్ర బృందం నిజాంపేట మండలంలోని నందిగామ, బత్తురాజుపల్లి, తిప్పనగుళ్ల, నార్లాపూర్, కల్వకుంట గ్రామాలను సందర్శించి ఇంకుడుగుంతలు, ఫాంపాండ్, నర్సరీలను సందర్శించి వాటి వివరాలను కార్యదర్శులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ హరితహారంలో విరివిగా మొక్కలు నాటాలన్నారు. గ్రామాలు పచ్చగా ఉంటేనే భూగర్భజలాలు పెరుగుతాయన్నారు. దేశవ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా నిజాంపేట మండలంలోని భూగర్భజలాలు అడుగంటాయన్నారు. వాటిని పైకి తేవాలంటే ప్రతి ఒక్కరూ కృషి ఉండాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ సిబ్బందికి ప్రజాప్రతినిధులు, గ్రామాల ప్రజలు సహకరించి భూగర్భజలాల పెంపుకు కృషి చేయాలన్నారు. నిజాంపేట మండలంలోని అన్ని గ్రామపంచాయతీలలో 22 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉన్నాయన్నారు. ఒక సంవత్సరం పాటు కష్టపడితే రెండు మీటర్ల పైకి జలాలను తీసుకురాచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఈ రఘురాం, జిల్లా పీడీ సీతారామారావు, డీపీవో హనోక్, రామాయంపేట, నిజాంపేట ఎంపీడీవోలు యాదగిరిరెడ్డి, వెంకటలక్ష్మి, ఎంపీపీ సిద్ధిరాములు, జెడ్పీటీసీ పంజా విజయ్‌కుమార్, ఉపాధ్యక్షుడు అందె ఇందిర, ఏఎంసీ వైస్‌చైర్మన్ అందె కొండల్‌రెడ్డి, కార్యదర్శులు మహ్మద్ అరీఫ్‌హుస్సేన్, నర్సింలు, సంధ్య తదితరులు పాల్గొన్నారు.

111
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...